Saturday, May 18, 2024
- Advertisement -

నిహారిక రెండో సినిమా ఎవరితో తెలుసా?

- Advertisement -

నాగబాబు కూతురు నిహారిక ఒక మనసు సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తుంది. టీవీ కార్యక్రమాలతో ఆకట్టుకున్న నిహారిక వెండితెర ఎంట్రీ ఎలా ఉంటుందా అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నెలలోనే నిహారిక మొదటి సినిమా విడుదలకు సిద్దం అవుతుంది. రామరాజు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో నాగశౌర్య హీరోగా నటించిన సంగతి తెలిసిందే. భారీ అంచనాలు ఉన్న ఈ సినిమాకి అన్ని ప్రాంతాల్లో మంచి బిజినెస్ జరుగుతుంది.

ఇక నాగశౌర్య మరియు నిహరికల మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయ్యిందని అంటున్నారు. ఓ స్టార్ కూతురిలా కాకుండా కమర్షియల్ రెగ్యులర్ హీరోయిన్ తరహాలోనే నిహారిక ఈ సినిమాలో నటించిందని చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు. ఇక ఈ అమ్మడి రెండో సినిమా దాదాపు ఖరారు అయినట్లు సమాచారం. మరోసారి నిహారిక ఒక మనసు హీరో నాగశౌర్యతో రోమాన్స్ చేసే అవకాశాలు సష్టంగా కనిపిస్తున్నాయి.

వీరిద్దరి కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కించేందుకు యువ దర్శకుడు స్క్రిప్ట్ ని సిద్దం చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఆ స్టొరీ లైన్ కి నిహారిక మరియు నాగశౌర్యలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. నాగశౌర్య తో నిహారిక రోమాన్స్ ప్రేక్షకులని ఆకట్టుకునేందుకు ఉద్దేశ్యంతో ఆ యువ దర్శకుడు ఈ జంటని ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -