భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో నిఖిల్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం స్వయం భూ. నిఖిల్ కెరీర్‌లో ఇది 20వ సినిమా పాన్ ఇండియా మూవీగా వస్తున్న ఈ సినిమా కోసం నిఖిల్ చాలా కష్టపడుతున్నారు.తన క్యారెక్టర్ కోసం వెపన్స్, మార్షల్ ఆర్ట్స్, గుర్రపు స్వారీలో ట్రైనింగ్ కూడా తీసుకున్నాడు.
ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో వేసిన మ్యాసీవ్ సెట్‌లో జరుగుతోండగా కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. నిఖిల్ సరసన సంయుక్త, నభా నటేష్ హీరోయిన్స్ గా నటిస్తుండగా రవి బస్రూర్ మ్యూజిక్ అందించారు. భారీ బడ్జెట్‌తో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండగా ఈ పీరియాడికల్ మూవీని తెరకెక్కిస్తున్నారు.
స్వయం భూ కోసం రంగంలోకి దిగారు సెంథిల్ కుమార్. కెకె సెంథిల్ కెమెరా డీవోపీగా చేయడంతో సినిమాలోని విజువల్స్ టాప్ నాచ్‌గా ఉండబోతున్నాయి. మొత్తంగా నిఖిల్ కెరీర్‌లో ఇది మోస్ట్ ఎక్స్ పెన్సీవ్ సినిమా ఇదే.