Friday, May 17, 2024
- Advertisement -

బాగానే సొమ్ము చేసుకుంటున్నారు!

- Advertisement -

ఎన్టీఆర్ మాస్ రోల్ లో బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకేక్కిన చిత్రం దమ్ము. భారీ అంచనాలతో తెరకేక్కిన ఈ చిత్రం అప్పట్లో ప్రేక్షకులను అలరించడంలో విఫలం అయింది. అయితే ఈ దమ్ము సినిమా బాలీవుడ్ లో సూల్తాన్ పేరిట డబ్ అయ్యింది. అయితే ఆ చిత్రాన్ని నెల పదిహేను రోజుల క్రితం యుట్యూబ్ లో అప్ లోడ్ చేసారు.

దాంతో వీక్షకులు ఎగబడి మరీ చూస్తున్నారు ఆ సినిమాని. కేవలం నెల పదిహేను రోజుల్లోనే కోటి వ్యూస్ తో సంచలనం సృష్టించింది ఎన్టీఆర్ దమ్ము. ఆ వ్యూస్ చూసి అందరూ  షాక్ అవుతున్నారు. తెలుగులో వచ్చిన ఈ చిత్రం ఘోర పరాజయం పొందింది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో కే ఎస్ రామారావు ,వల్లభ నిర్మించించారు ఈ చిత్రాన్ని. 

తెలుగులో వస్తున్న యాక్షన్ చిత్రాలను హిందీలో డబ్ చేస్తూ బాగానే సొమ్ము చేసుకుంటున్నారు అక్కడి జనాలు. అందులో భాగంగానే ఎన్టీఆర్ నటించిన దమ్ము చిత్రాన్ని ”సుల్తాన్ ” పేరుతో డబ్ చేసి యు ట్యూబ్ లో అప్ లోడ్ చేయగా కోటి వ్యూస్ దాటాయి. దాంతో ఎన్టీఆర్ సైతం షాక్ అయ్యాడట ఈ వార్త విని. ప్రస్తుతం ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో జనతా గ్యారేజ్ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే . 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -