Saturday, May 11, 2024
- Advertisement -

స్మార్ట్ ఫోన్ తొందరగా చార్జింగ్ అవ్వాలంటే కోసం చిట్కాలు!

- Advertisement -

స్మార్ట్‌ఫోన్లు పూర్తిగా చార్జ్‌ అవ్వాలంటే గంటల తరబడి సమయాన్ని తీసుకుంటాయి. అయితే కొన్ని ముఖ్యమైన చిట్కాలు పాటి ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ఫోన్‌ యూజర్లు తమ ఫోన్లను వేగవంతంగా చార్జ్‌ చేసుకోగలుగుతారు.

* ఫోన్లు చార్జ్‌ చేసేందుకు కంపెనీ చార్జర్లను మాత్రమే ఉపయోగించండి. ఫోన్‌తో పాటుగా వచ్చే కంపెనీ చార్జర్లు మన్నికైన పనితీరును కనబరుస్తాయి.

* వాల్‌ చార్జర్‌ను ఉపయోగించటం ద్వారా మీ స్మార్ట్‌ఫోన్‌ బ్యాటరీ వేగవంతంగా చార్జ్‌ అవుతంది.

* యూఎస్బీ 3.0 పోర్ట్‌, స్టాండర్డ్‌ ఏసీ వాల్‌ చార్జర్లతో పోలిస్తే శక్తిని మరింత వేగవంతంగా సప్లై చేస్తుంది. యూఎస్బీ 3.0 పోర్ట్‌ గరిష్ట వేగం 900ఎమ్‌ఏ. కాబట్టి యూఎస్బీ 3.0 పోర్ట్‌ ద్వారా మీ స్మార్ట్‌ఫోన్‌ బ్యాటరీని వేగవంతంగా చార్జ్‌ చేసుకోవచ్చు.

* యూఎస్బీ హబ్‌ ద్వారా స్మార్ట్‌ఫోన్లను చార్జ్‌ చేయటం వల్ల ప్రాసెసింగ్‌ 50శాతానికి పైగా తగ్గిపోతుంది. కాబట్టి యూఎస్బీ హబ్‌ ద్వారా స్మార్ట్‌ఫోన్లను చార్జ్‌ చేసే అలవాటుకు స్వస్తి పలకండి.

* ల్యాప్‌టాప్‌లతో పోలిస్తే డెస్క్‌టాప్‌లు ఎక్కువ శక్తిని వినియోగించుకుంటాయి. కాబట్టి మీ స్మార్ట్‌ఫోన్‌ను డెస్క్‌టాప్‌ యూఎస్బీ పోర్ట్‌ ద్వారా చార్జ్‌ చేయటం ద్వారా మరింత ప్రయోజనాన్ని పొందొచ్చు.

* డాకింగ్‌ స్టేషన్‌ మరో బెస్ట్‌ ఆప్షన్‌ మీ స్మార్ట్‌ఫోన్‌ను వేగవంతంగా చార్జ్‌ చేసేందుకు డాకింగ్‌ స్టేషన్‌ మరో బెస్ట్‌ ఆప్షన్‌.

* ఫోన్‌ చార్జ్‌ అవుతున్న సమయంలో వై-ఫై, బ్లూటూత్‌, జీపీఎస్‌ వంటి ఫీచర్లను టర్నాఫ్‌ చేయటం మంచిది. తద్వారా ఫోన్‌ వేగవంతంగా చార్జ్‌ అవుతుంది.

* చార్జ్‌ అవుతున్న సమయంలో ఫోన్‌ను వాడటం శ్రేయస్కరం కాదు. 

* చార్జ్‌ అవుతున్న సమయంలో ఫోన్‌ను స్విచాఫ్‌ చేయటం మంచిది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -