Sunday, May 5, 2024
- Advertisement -

అలనాటి నటుడు చంద్రమోహన్ ఇకలేరు..

- Advertisement -

సినిమా ఇండస్ట్రీలో మరో విషాదం నెలకొంది. ప్రముఖ నటుడు చంద్రమోహన్ (82) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో ఉదయం 9:45 గంటలకు తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

సిరిసిరి మువ్వ సినిమాతో పాపులర్ అయ్యారు చంద్రమోహన్.చాలా మంది హీరోయిన్స్‌ని ఇండస్ట్రీకి పరిచయం చేసింది ఆయనే. మల్లంపల్లి చంద్రశేఖరరావు ఆయన అసలు పేరు. 1943 మే 23న ఆంధ్ర ప్రదేశ్ లోని కృష్ణా జిల్లా పమిడిముక్కల గ్రామంలో జన్మించారు. దర్శకుడు కె విశ్వనాథ్ బంధువు, స్టార్ చంద్రమోహన్ 1966లో రంగుల రాట్నం సినిమా ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమయ్యారు. 1968లో వాణిశ్రీకి కేరింగ్ బ్రదర్‌గా ‘సుఖ దుక్కలు’ చిత్రంలో నటించి అవార్డులు అందుకున్నాడు. చంద్రమోహన్‌కు భార్య జలంధర, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. సోమవారం హైదరాబాద్‌లో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి.
మొత్తం 932 సినిమాల్లో నటించగా 175 సినిమాల్లో హీరోగా మెప్పించారు.

చంద్రమోహన్ మృతితో సినీ ఇండస్ట్రీ మూగ బోయింది. పలువురు ప్రముఖులు ఆయన మృతిపట్ల సంతాపం తెలిపారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ కన్నీటి పర్యంతం అయ్యారు?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -