Thursday, May 16, 2024
- Advertisement -

బాబాయ్‌తో పోటీ పడుతున్న నీహారిక?

- Advertisement -

నాగాబాబు కూతురు నీహారిక హీరోయిన్‍గా పరిచయం కాబోతున్న విషయం తెలిసిందే. నీహరిక హీరోయిన్‍గా నటిస్తున్న సినిమా పేరు ఒక మనసు. నాగశౌర్య హీరోగా నటిస్తున్న ఈ సినిమాకి రామ రాజు దర్శకత్వం వహిస్తున్నాడు. నీహారిక హీరోయిన్‍గా నటిస్తుండటంతో ఈ సినిమాపై భారీగానే అంచనాలు ఉన్నాయి.

ఐతే ఈ సినిమాని ఇప్పుడు సమ్మర్‍లో రిలీజ్‍కు ప్లాన్ చేస్తున్నారు. అవును ఈ సమ్మర్‍లో ఏకంగా బాబాయ్‍తోనే పోటీ పడబోతుంది నీహారిక. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా కాజల్‍ హీరోయిన్‍గా బాబీ దర్శకత్వంలో తెరకేక్కుతున్న సినిమా సర్దార్ గబ్బర్ సింగ్. ఈ సినిమాని ఏప్రిల్ 8న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

అల్లు అర్జున్  సరైనోడు మూవిని కూడా ఏప్రిల్ 8న రిలీజ్ అనుకున్నారు కానీ కొన్ని చర్చల వల్ల బన్నీ సినిమా వేనక్కి తగ్గింది. కానీ సడెన్‍గా బాబాయ్ తో పోటీ పడేందుకు నీహారిక సినిమాని తెస్తుండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఒక నీహారిక ఒక మనసు సినిమా విషయానికి వస్తే ఈ సినిమా ఆడియో మార్చ్ లో రిలీజ్‍కు ప్లాన్ చేస్తున్నారు. ఈ వేడుకకు చిరు – పవన్ సహా మొత్తం మెగా ఫ్యామిలీ హాజరవుతందని అంటున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -