Tuesday, May 21, 2024
- Advertisement -

చరణ్ సినిమాకి టైటిల్ ఫిక్స్

- Advertisement -

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం తని ఒరువన్ రీమేక్ లో నటించబోతున్నాడు. ఈ సారి ఎలాగైన హిట్ కొట్టాలని చూస్తున్నాడు. ఈ సినిమాకి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తుండగా గీత ఆర్ట్స్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ నెల 18నుండి ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుందని తెలుస్తుంది.

ఇక ఈ చిత్రాన్నికి టైటిల్ కూడా ఫిక్స్ చేశారు. కొన్ని రోజులుగా ఈ సినిమాకి రక్షక్ అని టైటిల్ పెట్టినట్లు కొన్ని వార్తలు వచ్చాయి. ఐతే ఈ సినిమాకి రక్షక్ టైటిల్ కాదు అని యూనిట్ సభ్యులు చెప్పేశారు. ఈ సినిమాకి “ధ్రువ” అనే టైటిల్ పెడుదాం అని చూస్తున్నారట. ఇంక ఈ సినిమాలో చరణ్ సరసన ఎవరు హీరోయిన్‍గా నటిస్తుందో తెలపాలేదు.

ఈ చిత్రాన్నికి తమిళ సంగీత దర్శకులు హిప్-హాప్-తమిజ పని చేస్తున్నారు. ఈ సినిమాని ఆగష్టు లో విడుదల చేయస్తాం అని అల్లు అరవింద్ ప్రకటించిన విషయం తెలిసిందే. బ్రూస్ లీ సినిమాతో నిరాశ పరిచిన చరణ్, మరి ఈ ధ్రువ సినిమాతో ఎలాంటి హిట్ కొడుతాడో చూడాలి మరి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -