తమిళ నాట ప్రస్తుతం మారుమోగి పోతున్న పేరు ” శివ కార్తికేయన్” వరుసగా హిట్టు మీద హిట్టు కొట్టేస్తూ ఘంటారావం మోగించేస్తున్నాడు ఈ యంగ్ హీరో. ఎతిర్ నీచల్.. వలిబార్ సంఘం.. వంటి సినిమాలతో పెద్ద స్టార్ అయిపోయాడు ఈ టివి యాంకర్.
అయితే ఇతగాడికో పెద్ద చిక్కొచ్చి పడింది. ఛోటా హీరో రేంజ్ నుంచి మిడ్ రేంజు హీరోగా ఎదిగేసిన ఇతగాడికి అటు టాప్ క్లాస్ హీరోయిన్లెవరూ దొరకడం లేదు. సమంత నుంచీ త్రిషా , నయనతార వరకూ ఇంతనితో నో అంటున్నారు.
పెద్ద హీరోలని పక్కన పెట్టి కుర్రాళ్ళతో సినిమాలు చేస్తున్న నయనతార లాంటి హీరోయిన్ కూడా ఇప్పుడు ఇతనితో సినిమాకి నాలుగు కోట్లు మూడు కోట్లు కావాలి అంటున్నారు.సమంత ని ఇతని నిర్మాత ఈ మధ్య సంప్రదించగా ఆమె ససేమిరా అందట, త్రిష మాత్రం మూడు కోట్లు ఇస్తే ఓకే అంటోంది.
ఆ హీరోకే ఒక కోటి రూపాయలు పారితోషికం నడుస్తోంది ఇక హీరోయిన్ కి రెండూ – మూడూ – నాలుగూ కొట్లిచ్చి ఎక్కడ పట్టుకోస్తారు ? కొత్త హీరోయిన్ లకి ఛాన్స్ ఇస్తే సొమ్మేం పోతుంది ?
