Tuesday, May 14, 2024
- Advertisement -

శ్రీను వైట్ల ఫ్యామిలీ ని టార్గెట్ చేసిన కోనా వెంకట్ ?

- Advertisement -

 

శ్రీను వైట్ల – కోనా వెంకట్ లని ఎంత కలిపినా మళ్ళీ మాములుగా పామూ ముంగీసల్లా కొట్టుకొవడం మొదలు పెట్టారు వీరిద్దరూ. అభిప్రాయ బేధాలు రావడం సహజం కానీ పచ్చ గడ్డి వేస్తే భగ్గు మనెంత ఇబ్బందులు తయారు అయ్యాయి వీరిద్దరికీ , సినిమా అనేది ఒక మీడియం మాత్రమె అన్న సంగతి మరచిపోయి తన కోపం అంతా సొంత ప్రొడక్షన్ సినిమా శంకరాభరణం లో చూపించేశారు అని అంటున్నారు విశ్లేషకులు.

ఒక డైరెక్టర్ పాత్ర ని కృష్ణ భగవాన్ తో చేయించిన కోనా వెంకట్ , కథానుసారం స్టార్ హీరోగా వెలుగుతున్న భజరంగి (ఆర్టిస్టు గిరిధర్) బీహారులో కిడ్నాప్ అవడంతో, అతని నిర్మాత సరాసరి కిడ్నాపర్ల డెన్ వద్దే షూటింగ్ ప్లాన్ చేసుకుని డైరెక్టర్ (ఆర్టిస్టు కృష్ణ భగవాన్) గారిని అక్కడికే ఆహ్వానిస్తాడు.

ఇక్కడ కృష్ణ భగవాన్, నిఖిల్ మధ్య వచ్చే సంభాషణల్లో ఎక్కువ శాతం వైట్లను ఉద్దేశించి రాసినవేనని యిట్టె తెలిసిపోతుంది. ఒకానొక సమయంలో, మా పెళ్ళాలతో కూడా సరిగ్గా కాపురం చేయకుండా క్రియేటివిటి మీద కూర్చుంటాం అని కృష్ణ భగవాన్ అంటుంటే శ్రీను వైట్ల, రూప వైట్ల మధ్య జరిగిన కాంట్రవర్సరీ గుర్తు రాకుండా ఉండదు.

ఇలాంటి పర్సనలు వివాదాలను సినిమాలలో వాడుకునే సంస్కృతి ఇంతకు మునుపు వైట్ల గారు ప్రకాష్ రాజ్ మీద రాసిన ఆగడు డైలాగుల్లో ధ్వనించింది. ఇప్పుడు వైట్ల దగ్గరే ఆ విద్యను అభ్యసించిన కోన, ఏకంగా గురువు మీదే అస్త్రం ఎక్కుపెట్టాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -