Saturday, May 4, 2024
- Advertisement -

పాకిస్థాన్ క్రికెటర్ తో తమన్నాకి లింక్ ఏంటి..?

- Advertisement -

హీరోయిన్ తమన్నా.. స్టార్ హీరోల సరసన నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. కేవలం తెలుగులోనే కాకుండా.. తమిళంలో.. హిందిలో కూడా ఈ భామ సినిమాలు చేసింది. అక్కడ కూడా మంచి విజయాలు అందుకుంది. అయితే ఇప్పటివరకు తమన్న ఓ హీరోతోనే తిరుగుతోందని.. ప్రేమలో పడిందని, ఆ హీరోతో తెగదెంపులు చేసుకుందని.. వంటి వార్తలు ఇప్పటివరకు వినలేదు. తమన్నా ఇలాంటి విషయాలన్నింటికీ చాలా దూరంగా ఉంటుంది.

అందుకే ఇప్పటివరకు ఆమె ఎలాంటి వివాదాల్లో చిక్కుకోలేదు. కానీ తమన్నాకి సంబంధించిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో బాగా హల్ చల్ చేస్తోంది. ఈ ఫోటోలో తమన్నా పక్కన ఉన్నది ఒక పాకిస్తాన్ క్రికెటర్ కావడం విశేషం. పాకిస్థాన్ క్రికెటర్ అబ్దుల్ రజాక్ ని.. తమన్నానిపక్క పక్కనే ఓ నగల షాపులో చూసి, వీరిద్దరు ప్రేమలో పడ్డారని, పెళ్లి చేసుకోబోతున్నారని, అందుకే నగల షాప్ లో నగలు కొనేందుకు వచ్చారని, ఏవేవో అనుకున్నారు చాలా మంది.

వాస్తవంలోకి వెళితే ఈ ఫోటో ఇప్పటిది కాదు. ఎప్పుడో 2013వ సంవత్సరంలో దుబాయిలోని ఓ నగల షాపు ఓపెనింగ్ కి అతిథులుగా వెళ్ళారు తమన్నా, రజాక్. ఇది అప్పటి ఫోటో. కొత్తగా వైరల్ అవ్వడం వలన ఈ ఫోటో కొత్తదేమో అని పొరబడ్డారు జనాలు. తమన్నాకి రజాక్ తో ఎలాంటి సంబంధం లేదు. నిజానికి ఆ రోజు తరువాత మళ్లీ వారు కలవనే లేదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -