Tuesday, May 6, 2025
- Advertisement -

ప్రత్యేక హోదా పై సాయి ధరమ్ తేజ్ పంచ్.. పవన్ ఫాన్స్ కి కోపం వచ్చింది!

- Advertisement -
pavan fans fire on sai dharam tej

పాపులర్ ఇష్యూలను గుర్తు చేస్తూ ఈమధ్య సినిమాల్లో పంచ్ డైలాగులు పెట్టడం సర్వసాధారణ విషయంగా మారిపోయింది. అయితే ఈసారి మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తన చిన మామయ్య పవన్ కళ్యాణ్ ను అనుసరిస్తూ 6 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజల కల ప్రత్యేక హోదాను టార్గెట్ చేస్తూ వేసిన పంచ్ మెగా అభిమానులను బాగా అలరిస్తోంది.

ఆశక్తికరమైన ఈన్యూస్ వివరాలలోకి వెళ్ళితే లేటెస్ట్ గా విడుదలయిన సాయి ధరమ్ తేజ్ మూవీ ‘విన్నర్’ ట్రైలర్ లో కొంతకాలంగా ఏపీలో హాట్ టాపిక్ గా చర్చ జరుగుతున్న ప్రత్యేక హోదా విషయాన్ని గుర్తుకు చేస్తూ ఒక పంచ్ డైలాగ్ ఉంది. ‘ఇష్టం లేకున్నా ప్రత్యేక హోదా ఇచ్చేస్తావా’ అంటూ వెన్నెల కిషోర్ ను చూసి కామెంట్ చేస్తే వెన్నెల కిషోర్ ‘ప్రత్యేక హోదానా ?’ అని ఆశ్చర్యంగా అడగడం అందరినీ ఆకర్షిస్తోంది. అయితే ఇప్పుడు ఈ సినిమాలో ప్రత్యేక హోదా విషయాన్ని గుర్తుకు చేస్తూ పంచ్ డైలాగ్ వేయడం అవసరమా అని పవన్ ఫ్యాన్స్ అంటున్నారు. అసలే ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా కోసం పోరడుతున్న సమయంలో ఇలా కామెంట్స్ చేయడం సినిమాకి మంచిది కాదని పవన్ ఫాన్స్ సోషల్ మీడియా వేదికగా చెప్తున్నారు.

సాయిధరమ్‌తేజ్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ సినిమాకి గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నారు. రకుల్‌ప్రీత్‌సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది. నల్లమలుపు శ్రీనివాస్(బుజ్జి), ఠాగూర్ మధు సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా ట్రైలర్ ఆవిష్కరణ సభలో సాయిధరమ్‌తేజ్ మాట్లాడుతూ హార్స్ రేసుల నేపథ్యంలో సాగే చిత్రమిది. నేపథ్యం చాలా కొత్తగా వుంటుంది. జగపతిబాబుతో కలిసి నేను చేస్తున్న రెండవ చిత్రమిది. తమన్ అద్భుతమైన సంగీతం అందించాడు. దర్శకుడు నాలోని స్పీడును కంట్రోల్ చేస్తూ తనకు కావాల్సింది రాబట్టుకున్నారు. కథ డిమాండ్ మేరకు నిర్మాతలు రాజీపడకుండా ఖర్చుచేశారు అని తెలిపారు.

{youtube}v=TD_xTFLNFTs{/youtube} 

Related

  1. సాయి పల్లవి మాయలో పడ్డ నాని!
  2. మళ్ళీ అదే తప్పు చేస్తున్న సాయి ధరమ్ తేజ!
  3. నైట్ ఆ హీరోయిన్‌తో అడ్డంగా దొరికిపోయిన సాయిధ‌ర‌మ్‌
  4. సొంత కూతురిపై రేప్ చేసిన కసాయి తండ్రి

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -