Friday, May 3, 2024
- Advertisement -

సాయి పల్లవి మాయలో పడ్డ నాని!

- Advertisement -
Sai Pallavi to romance Nani in his next with Dil Raju

మలయాళ ప్రేమమ్ సినిమాలో మలార్ పాత్రలో నటించింది సాయి పల్లవి. మలార్ గా ఈ భామ అందరినీ మాయ చేసింది. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరి ముందుగా మాట్లాడుకునేది ఈ భామ గురించే. ప్రస్తుతం ఈ భామ వరుణ్ తేజ్ తో కలిసి ఫిదా అనే సినిమాలో నటిస్తోంది. తెలుగులో ఈ భామ చేస్తున్న సినిమా విడుదల కాకముందే.. ఇప్పుడు మరో లక్కీ ఛాన్స్ అమ్మడిని వరించిందని సమాచారం. రీసెంట్ గా నేను లోకల్ తో మంచి హిట్ కొట్టిన నానితో.. కలిసి సాయి పల్లవి నటించబోతుందని తెలుస్తోంది.

దిల్ రాజు నిర్మాణంలో.. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో నాని ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం సాయి పల్లవిని తీసుకున్నారట యూనిట్. కథ విషయంలో కానీ.. తన పాత్ర విషయంలో కాని ఏ మాత్రం కాంప్రమైజ్ కాని సాయి పల్లవి.. దర్శకుడు వేణు శ్రీరాం చెప్పిన కథకు ఫ్లాట్ అయిపోయిందట. అయితే.. డేట్స్ విషయంలో మాత్రం కొన్ని ఎడ్జస్ట్ మెంట్స్ చేసుకోవాల్సి ఉంటుందని.. ఆ పని పూర్తయ్యాక అగ్రిమెంట్ సైన్ చేస్తానని చెప్పిందట.

తెలుగులో ఫిదా సినిమా చేస్తూనే.. తమిళ సినిమా ఛార్లీ కోసం బల్క్ డేట్స్ కేటాయించింది సాయి పల్లవి. ఇప్పుడు నాని సినిమా కోసం ఈ డేట్స్ ఎడ్జస్ట్  చేసుకోవాల్సి ఉంటుంది. అయితే.. నాని సినిమా తప్పనిసరిగా చేస్తానని సాయిపల్లవి చెప్పిందట. 

{youtube}Yfm_ZjPYOFA{/youtube}

Related

  1. నానికి పవన్ లవర్ కి లింక్ ఏంటి..?
  2. నాని హీరోయిన్ తో రొమాన్స్ చేస్తున్న వ‌రుణ్‌తేజ్‌
  3. పెళ్లయిన అమ్మాయి వెంట పడుతున్న నాని!
  4. నాని కోసం రాజమౌళి ఏం చేస్తున్నాడంటే?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -