Monday, May 20, 2024
- Advertisement -

బన్నీపై కౌంటర్ వేసిన పవన్ ఫ్యాన్స్!

- Advertisement -

పవర్ స్టార్ ఫ్యాన్స్ కి, స్టైలీష్ స్టార్ ఫ్యాన్స్ కి మధ్య వివాదం ఇప్పుడిప్పుడే తగ్గేటట్లు కనపడటం లేదు. అల్లు అర్జున్ ఏ సమయంలో చెప్పను బ్రదర్ అన్నడో కానీ, పవన్ ఫ్యాన్స్ ఇప్పుడీ డైలాగ్ ను ట్రెండింగ్ గా మార్చేశారు. అంతటితో ఊరుకున్నారా ఇప్పుడు చెప్పను బ్రదర్ కు కౌంటర్..”చూసుకుంటాం బ్ర‌ద‌ర్” అని అంటున్నారు.

పూర్తి వివరాల్లోకి వెళితే…రీసెంట్ గా విజయవాడలో జరిగిన సరైనోడు బ్లాక్ బస్టర్ ఫంక్షన్ లో.. ఈ వ్యాఖ్యల దుమారం మొదలై ఇంకా కొనసాగుతోంది. పవన్ ని ప్రత్యేకంగా …అల్లు అర్జున్ ఏమీ అనకపోయినా…ఫ్యాన్స్ పవన్ గురించి చెప్పమని అంటే.. ‘చెప్పను బ్రదర్’ అన్నాడు. ఇదే పవన్ ఫ్యాన్స్ కి కోపం తెప్పించడానికి కారణమైంది. రీసెంట్ గా ఓ పబ్లిక్ పోస్టర్ లాంటిది డిజైన్ చేసి.. ఇన్ డైరెక్టుగా వార్నింగ్ కూడా ఇచ్చేసి రచ్చ చేసారు.

దాన్ని కంటిన్యూ చేస్తూ మళ్లీ హైదరాబాద్ లో మీడియాకు ఇచ్చిన ఇంటర్వూలలో …బన్ని ని అదే ప్రశ్న మీడియావారు అడగటం జరిగింది. బన్ని అదే మాట మీద ఉన్నారు. మళ్లీ అదే సమాధానం చెప్పారు. ఆ విషయమై ఓ ప్రక్క రాజీ ప్రయత్నాలు అంటూ మీడియాలో వినిపిస్తూంటే, అల్లు అర్జున్ మాత్రం తాజాగా ఇచ్చిన ఇంటర్వూలో సైతం అవే పదాలని బన్ని రిపీట్ చేసారు. మీడియావారు బన్నిని …చెప్పను బ్రదర్ వివాదంపై స్పందించమంటే ఇప్పుడు కూడా తాను చెప్పను బ్రదర్ అన్నారు.

అదేమిటంటే… ‘సరైనోడు’ వేడుకలో ‘పవన్‌ గురించి మాట్లాడను బ్రదర్‌…’ అన్నారు. దాని గురించి సోషల్‌ మీడియాలో బాగా చర్చ జరిగింది? ఇప్పుడూ అదే మాట… ‘పవన్‌ గురించి మాట్లాడను బ్రదర్‌’. ఈ ప్రశ్న తప్ప ఇంకేదైనా అడగండి అని అల్లు అర్జున్ స్పష్టంగా చెప్పారు. మరి ఈ వివాదం ఎక్కడిదాకా వెళ్లి ఆగుతుందో చూడాలి.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -