Sunday, May 19, 2024
- Advertisement -

సేనాపతి టైటిల్ సంచలనం సృష్టిస్తోంది!

- Advertisement -

సర్దార్ గబ్బర్ సింగ్ అనుకున్న రేంజ్ లో హిట్ కాకపోవడంతో ఈ సారి ఎలాగైన భారీ హిట్ కొట్టాలి అని పవన్ ఫిక్స్ అయ్యాడు. అందుకే తన తో రెండు సినిమాలు తీసిన ఎస్ జే సూర్య తో ఇప్పుడు ఓ సినిమా మొదలు పెట్టాడు. ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన ఖుషి అద్భుతమైన విజయం సొంతం చేసుకోగా ఆ తర్వాత వచ్చిన పూలి సినిమా అనుకున్నంత విజయం సొంతం చేసుకోలేక పోయింది.

ఈ సారి పక్కా హిట్ కొట్టాలి అని పవన్ మరియు ఎస్ జే సూర్య ఫిక్స్ అయ్యినట్లు తెలుస్తుంది. ఈ ఫ్యాక్షన్ లవ్ స్టోరిగా ఈ చిత్రం తెరకేక్కుతున్నట్లు తెలుస్తుంది. అయితే ఇటివలే ఈ చిత్ర్రాన్నికి సంబంధించి హుషారు అనే టైటిల్ పెట్టే అలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ఇప్పుడు ఈ సినిమాకి సంబందించి మరో టైటిల్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. సేనాపతి అనే టైటిల్ తో సాంకేతిక నిపుణుల వివరాలతో వచ్చిన ఓ పోస్టర్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది.

సేనాపతి టైటిల్ కాగా నమ్మితే ప్రాణాలైన ఇస్తాడు అనేది ట్యాగ్ లైన్. ఎస్ జే సూర్య దర్శకత్వంలో శరత్ మరార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నట్లు వెలువడింది ఓ పోస్టర్. అయితే ఇదంతా పవర్ స్టార్ ఫ్యాన్స్ చేసిన మాయాజాలం. ఫోటో షాప్ లో పవన్ స్టిల్ తో రకరకాల గిమ్మిక్కులు చేసి సోషల్ మీడియా లోకి వదిలారు. అది వైరల్ లా పాకుతోంది. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -