Wednesday, May 15, 2024
- Advertisement -

నితిన్ నా తమ్ముడిలా అనిపించాడు!

- Advertisement -

నితిన్, సమంత, అనుపమ పరమేశ్వరన్ హీరో హీరోయిన్స్ గా తెరకేక్కుతున్న చిత్రం అ..ఆ. ఈ చిత్రాన్నికి మాటల మాత్రికుడు త్రివిక్రామ్ దర్శకత్వం వహిస్తుండగా మిక్కీ సంగీతం అందిస్తున్నారు. ఇటివలే ఈ సినిమాకి సంబంధించి ఆడియో గ్రాండ్ గా జరింగింది. ఈ ఆడియో వేడుకకు పవన్ ముఖ్య అతిధిగా వచ్చారు.

స్టేజ్ మీద మాట్లాడ్డం తనకు ఎప్పుడూ ఇబ్బందిగాను భయంగానూ ఉంటుందన్న పవన్.. ముఖ్యంగా సినిమా ఫంక్షన్స్ లో మాట్లాడాలంటే… సినిమాలకు పరిచయం లేని వ్యక్తి మాట్లాడినంత బెరుగ్గా ఉంటుందని అన్నాడు. ‘నితిన్ కి నేను ఇంత ఇష్టమని ఇప్పుడు తను చెప్పేవరకూ నాకు తెలీదు. నితిన్ ని మొదటిసారి చూడగానే నా తమ్ముడిలా అనిపించాడు. నేను నా సినిమాలు తప్ప వేరే ఏమీ పట్టించుకోను. ఇష్క్ సినిమా ఆడియోకి పిలిచిపుడు రావాలా అనుకున్నాను. నాకు లాగా హిట్స్ లేక ఇబ్బందులు పడుతున్నాడని తెలిసింది.

తమ్ముడు ఇబ్బందుల్లో ఉంటే భుజం తట్టడానికి వస్తాం కదా.. అందుకే ఆరోజు వచ్చాను.  సినిమా హిట్ అయిందంటే.. అందుకు దర్శకుడు యూనిట్ పడ్డ కష్టమే. ఇప్పుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం.. నితిన్ గారికి మంచి పేరు తీసుకురావాలని దేశంలోనే పెద్ద స్టార్ అవ్వాలని కోరుకుంటున్నా’ అన్నాడు పవన్. సో పవన్ ఇష్క్ సినిమా ఆడియో వేడుకకు వచ్చి తన బ్లెసింగ్స్ ఇచ్చాడు. ఆ సినిమా సూపర్ హిట్ అయింది. మళ్ళీ ఈ అ..ఆ సినిమాకి వచ్చాడు. ఈ సినిమా కూడా అద్భుతమైన హిట్ అవుతుందని అంటూన్నారు. మరి ఈ అ..ఆ సినిమా ఎలాంటి విజయం సొంతం చేసుకుంటుందో తెలియాలి అమ్టే సినిమా వచ్చే వరకు ఆగాల్సిందే.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -