Friday, May 10, 2024
- Advertisement -

అజ్ఞాత‌వాసి డైలాగ్‌లు లీక్‌

- Advertisement -

25వ సినిమా అజ్ఞాత‌వాసిగా ప‌వ‌న్‌క‌ల్యాణ్ సినిమా వ‌స్తోంది. గ‌బ్బ‌ర్‌సింగ్ సినిమా ఆడియో విడుద‌ల ఆ స‌మ‌యంలో లీక‌య్యింది. ఆ త‌ర్వాత అత్తారింటికి దారేది స‌గం సినిమా ఇంట‌ర్నెట్‌లో వ‌చ్చి టాలీవుడ్‌కు పెద్ద స‌వాల్‌గా మారిందే. ఆ త‌ర్వాత ప‌వ‌న్‌క‌ల్యాణ్ సినిమాలు ఎన్ని వ‌చ్చినా ఏదో ఒక‌టి లీకవుతూనే ఉంది. ఇప్పుడు తాజాగా త‌న స్నేహితుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వంలో అజ్ఞాత‌వాసి సినిమా చేస్తున్నాడు. ప్ర‌స్తుతం ఆ సినిమా షూటింగ్ అంతా పూర్త‌యి సంక్రాంతి పండుగ‌కు విడుద‌ల‌య్యేందుకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా టీజ‌ర్ శ‌నివారం (డిసెంబ‌ర్ 16)న విడుద‌ల చేయ‌గా ప్రేక్ష‌కులు, అభిమానుల నుంచి మంచి స్పంద‌న వ‌చ్చింది. ఇవ‌న్నీ ప‌క్క‌న‌పెడితే టీజ‌ర్‌లో లేని డైలాగ్‌లో సినిమాలో ఉన్న డైలాగ్‌లు జ‌నాల్లోకి వ‌చ్చేశాయి. అంటే సినిమా డైలాగ్‌లు లీక‌య్యాయి. లీకైన డైలాగ్‌లు సోష‌ల్ మీడియాలో వైర‌ల‌య్యాయి. నెట్ ప్ర‌పంచంలో తిరుగుతున్నాయి.

సినిమా డైలాగ్‌లుగా చెప్తున్న‌వి సినిమాలో ఉన్నాయో లేవో కానీ డైలాగ్‌లు మాత్రం సూప‌ర్బ్‌గా ఉన్నాయ‌ని ప్రేక్ష‌కులు, అభిమానులు చెబుతున్నారు. ప‌వ‌న్‌కు మ‌ళ్లీ హిట్ అని ధీమా వ్య‌క్తం చేస్తున్నారు.

కష్టాలు చెప్పుకోవడానికి బాగుంటాయి కాని
భరించడానికే ఇబ్బందిగా ఉంటాయి

మనకు తెలిసింది అవతలి వాళ్లకు పరిచయం చెయ్యాలి
మనం తెలియంది పరిచయం చేసుకోవాలి

నా కోపానికి మార్కులు ఉండవు
ఒక వేళ ఉంటే మాత్రం వందకు వంద ఉంటాయి పిన్ని

నవ్వంటే సంతోషం అనుకునే లోపే
ఏడుపంటూ ఒకటుందని గుర్తు చేస్తుంది జీవితం అభిజిత్

ఎమున్నరండి అలనాటి సావిత్రి సౌందర్యని
గుర్తు చేసారండి
మీరు మరీ జోక్ చేస్తారండి
బక్క చిక్కిన చిరంజీవి లా ఉంటారండి

ఈ ఇంట్లో పోలిటిక్స్ ఎక్కువ
ఒకడిని తోక్కేయ్యడాన్ని పాలిటిక్స్ అనరు
ఒకడికోసం బ్రతకడాన్ని పోలిటిక్స్ అంటారు

ముందు ఓడిన వాడు గెలవడం సులువు
కాని గెలిచిన వాడు మళ్లీ గెలవడం ఖాయం

నువ్వు టైం ఇచ్చేకొద్దీ భయపడ్డావ్
నేను టైం ఇచ్చే కొద్దీ రెచ్చిపోతా

అవసరం కోసం అబద్ధాలు చెప్పేవాడికి
నిజాయితీగా నిజాలు చెప్పేవాడికి చాలా తేడాలు ఉంటాయి సార్

ఆశించే వాడికి శాసించడం రాదు
శాశించే వాడికి ఆశించడం రాదు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -