Saturday, May 18, 2024
- Advertisement -

టార్గెట్ 2019….. హోదా, పోలవరం అమ్మ బాబులాంటి హామీలు రెడీ….. బాబా మజాకానా?

- Advertisement -

ఉట్టికెగరలేనమ్మ స్వర్గానికెగురుతానందట అనే సామెత తెలుసు కదా. కానీ చంద్రబాబు నైజం గురించి చెప్పాలంటే స్వర్గానికి కాదు అంతకుమించి కూడా ఏదో ఎగరడానికి ట్రై చేసిందట అని చెప్పుకోవాలి. అలా అని చంద్రబాబు ప్రయత్నిస్తున్నట్టుగా కాదు…ప్రయత్నిస్తున్నట్టుగా జనాలను నమ్మించడంలో ఘనాపాటి. ఆయన చుట్టూ ఉన్న ఎల్లో మీడియా భజన బృందాలు ఆ విషయంలో ప్రపంచానికి పాఠాలు చెప్పగలవు మరి. కిరణ్ కుమార్‌రెడ్డిని సమైక్యాంధ్రవీరుడిగా…..చంద్రబాబు బంటు లాంటి ఒక ఉద్యోగ సంఘాల నేతను ఆరడుగుల బుల్లెట్‌గా చూపించి సీమాంధ్రులను దగా చేయడంలో ఏ స్థాయిలో సక్సెస్ అయ్యారో చూశాంగా…..ఇక 2014 ఎన్నికల సమయంలో బాబొస్తే 15ఏళ్ళు ప్రత్యేక హోదా, పోలవరం, రైల్వేజోన్, అత్యద్భుత రాజధాని, రుణమాఫీలు, మద్యం మహమ్మారిని పారదోలడం, నిరుద్యోగులకు, మహిళలకు అత్యద్భుత వరాలు అంటూ ప్రజలను నమ్మించారుగా. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు మాత్రం ఇప్పటి వరకూ ఒక్క హామీని కూడా పూర్తిగా అమలు చేసింది లేదు. రాజధాని నిర్మాణం విషయంలో ఒక్క శాశ్విత నిర్మాణానానికి కూడా పునాది రాయి పడింది లేదు. అయితేనేం……బాబుగారు మాత్రం దేశదేశాలు తిరిగారు. బుల్లెట్ ట్రైన్ ముందు ఫొటోలకు ఫోజులిచ్చారు……ఇక చినబాబు లోకేష్ కూడా ఆయా దేశాల్లో ఉన్న అత్యద్భుతాలు అని అక్కడి వాళ్ళు చెప్పే వాటి ముందు ఫొటోలు దిగారు. అవన్నీ అమరావతికి వస్తాయని ప్రచారం చేశారు. ప్రజల సొమ్ము కోటాను కోట్లు తగలేసి విహారయాత్రలు చేసి ప్రజలకు ఆ దృశ్యాలను చూపించి సంతోషపడమన్నారు. దేశంలోనే ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి తిరిగినన్ని దేశాలు ప్రధాని మోడీ కూడా తిరగలేదు మరి. ఇక ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పోలికే లేదు. అదేమని ఎవరైనా ప్రశ్నిస్తే ప్రాజెక్టులు, కంపెనీలు వస్తున్నాయంటారు. మూడున్నరేళ్ళలో వచ్చినవి ఎన్ని? ఎన్ని ఉద్యోగాలు వచ్చాయి? ఎన్ని లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయి అని అడిగితే ……అలా అడిగిన వాళ్ళందరూ జగన్ మనుషులని, అభివృద్ధిని అడ్డుకుంటున్నారని ముద్రవేస్తారు. ఇక ప్రత్యేక హోదా, రైల్వే జోన్‌లాంటి విషయాల్లో అతీగతి లేదు. ప్యాకేజ్‌కి కూడా దిక్కులేదని ఈ మధ్యనే బాబుగారు అసలు నిజం చెప్పేశారు.

మరి ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో, ఐదేళ్ళ అసమర్థ పాలన తర్వాత కూడా 2019 ఎన్నికల్లో మేమే గెలుస్తాం అని టిడిపి అండ్ కో నమ్మకంగా ఎలా చెప్పగలుగుతున్నారు? ఏముంది? వెరీ సింపుల్. 2014లో ఫాలో అయిన స్ట్రాటజీనే ఫాలో అవుతున్నారు. 2014తర్వాత మోడీ బలాన్ని ఉపయోగించుకుని…మోడీతో కలిసి అభివృద్ధి చేస్తామన్నారు. ఆ తర్వాత ఏమీ చేయలేక మోడీ మరీ శక్తిమంతుడవడంతో బాబును పట్టించుకోవడం లేదని సెంటిమెంట్ రాగాలు తీస్తున్నారు…..ఇక 2019 తర్వాత ఏంటి అంటే అద్భుతమైన వ్యూహం రెడీ చేశారు. 2019 ఎన్నికల తర్వాత మోడీకి ఇంత బలం ఉండదని….అప్పుడు బలహీనుడైన మోడీ ముక్కుపిండి అన్నీ తీసుకొచ్చే సత్తా చంద్రబాబుకు ఉంటుందని చెప్తున్నారు. పోలా……అదిరిపోలా….అమాయకులను నమ్మించడానికి ఈ మాటలు సరిపోవా? ఇక 2019లో కూడా అవే హామీలు అంటే కష్టం కాబట్టి ఈ సారి డోస్ పెంచారు. ఆ పెంచడం కూడా మామూలుగా లేదు. 2014లోనే సమాజంలోని అన్ని వర్గాల ప్రజలనూ 2019కల్లా ఎక్కడికో తీసుకెళ్తానని హామీలు ఇచ్చిన బాబు ఈ సారి ఇంకా రేంజ్ పెంచేశాడు. 2014లో పోలవరం అంటే ఈ సారి 2019లో రాష్ట్రంలో ఉన్న నదులన్నింటినీ అనుసంధానం చేస్తానని చెప్తున్నాడు. అందుకోసం లక్ష కోట్లపైనే పెట్టుబడితో సీమాంధ్ర మొత్తాన్ని మాగాణి చేసేస్తాడట. ఇక ఎల్లో మీడియా కూడా రెండు రోజులుగా ఆ విషయం గురించి మామూలుగా చెప్పడం లేదు. 2014 ఎన్నికలకు ముందు హోదా గురించి ఎంత గొప్పగా చెప్పారో. హోదా వస్తే సీమాంధ్ర ఏ స్థాయిలో డెవలప్ అవుతుందో చెప్పినట్టుగానే ఇప్పుడు ఈ నదుల అనుసంధానం గురించి చెప్తున్నారు. అఫ్కోర్స్ హోదా అయినా, నదుల అనుసంధానం అయినా బాబుకు ఓటేస్తేనే అని కూడా హెచ్చరిస్తున్నారనుకోండి. ఇక బ్లాక్ మనీ తెచ్చి ఒక్కొక్కళ్ళ అకౌంట్‌లో లక్షలు వేస్తానన్న మోడీని ఇన్‌స్పిరేషన్‌గా తీసుకుని బాబు కూడా నగదు బదిలీ పథకం రూపొందిస్తున్నాడట. 2009లో లోకేష్ బాబు టాలెంట్ అని చెప్పిన ఈ నగదు బదిలీ పథకాన్ని ఈ సారి సరికొత్తగా తెస్తున్నారట. ఒక్కొక్కళ్ళ అకౌంట్‌లో డైరెక్ట్‌గా భారీ అమౌంట్ పడేలా చేస్తామని చెప్తారట. ఇక ఎల్లో మీడియా కూడా అప్పుడున్న రాయితీ పథకాలతో ఎంత నష్టమో, డైరెక్ట్‌గా అకౌంట్‌లో పడితే ఎంత లాభమో……అలాంటి పథకాలు ఉన్న దేశాలు ఎంత అభివృద్ధి సాధించాయో అనే విషయాలు కూడా కథలు కథలుగా చెప్పడం ఖాయం.

2014లో మోడీ, బాబుల చేతిలో దారుణంగా మోసపోయిన సీమాంధ్రప్రజలు ఈ సారి కూడా బాబుకే ఓటేస్తారా? తను ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా మోడీ ఇచ్చిన హామీలు కూడా రాకుండా తానే అడ్డుపడిన …..ఓటుకు నోటు కేసుతో సహా తన అక్రమాల నుంచి బయటపడడం కోసం హాదా, జోన్‌లాంటి ప్రయోజనాలను తుంగలో తొక్కిన బాబును సీమాంధ్రప్రజలు మరోసారి నమ్ముతారా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -