Saturday, May 18, 2024
- Advertisement -

బిజినెస్‌ మ్యాన్ ’లెక్క‌’ కి, గబ్బర్‌ సింగ్ ’తిక్క’ కి లింక్‌ కుదిరేనా!

- Advertisement -

అన్నీ కలిసొస్తే పవర్ స్టార్ పవన్‌ కళ్యాణ్, సూపర్ స్టార్ మహేశ్ బాబు కాంబోలోఒక సినిమా రావడానికి అవకాశం ఉంది. అంత పవర్‌పుల్ స్క్రిప్ట్‌ రెడీ చేసి సెట్స్‌ మీదకు తీసుకెళ్ళే దమ్మున్న డైరెక్టర్ ఎవరో తెలీదు కానీ..

ఈ తరహాలో రాబోయే రోజుల్లో సినిమా వచ్చే వకాశాలు ఉన్నాయంటున్నారు ఫిల్మ్‌ నగర్ వర్గాలు.

దీనికి కారణం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో మల్టీ స్టారర్ చిత్రం చేయడానికి నేను రెడీ అంటూ ట్విట్టర్ లో ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు బదులిచ్చాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. ఈనెల 7న మహేష్ నటించిన శ్రీమంతుడు చిత్రం రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ట్విట్టర్ లో తన అభిమానులతో ఇంటరాక్ట్ అయ్యాడు మహేష్ .

అభిమానులు వేసిన పలు ప్రశ్నలకు ఓపికగా సమాధానాలు ఇస్తున్న సమయంలో ఓ అభిమాని పవన్ తో సినిమా చేస్తారా ? అంటూ ప్రశ్న వేయడంతో ఎందుకు చేయను మా ఇద్దరికీ సరిపడా కథ దొరికితే ,అసలు సిసలైన డైరెక్టర్ దొరికితే నేను సిద్దమే అంటూ ప్రకటించాడు .

ఇది నిజమౌతుందో కాదో తెలీదు కాని పవన్ అభిమానులకు, మహేశ్ అభిమానులు మాత్రం దీనిపైన సోషల్ నెట్‌వర్క్స్‌లో తెగ స్పందిస్తున్నారు. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -