Saturday, May 11, 2024
- Advertisement -

అలాంటి ఈ మెయిల్స్‌ వస్తే జాగ్రత్త వహించండి!

- Advertisement -

ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థ మైక్రోసాఫ్ట్ తాజాగా విండోస్‌10 ఆపరేటింగ్ సిస్టమ్‌ను విడుదల చేసిన విషయం అందరికి తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలలో ఈ ఆపరేటింగ్ సిస్టమ్‌ని విడుదలచేసింది.

చాలా తక్కువ టైమ్‌లోనే ఎక్కువ మంది యూజర్లకు చేరువైంది. 

అయితే ఇంత తక్కువ టైమ్‌లో చాలా పాపులారిటి పొందిన నేపథ్యంలో, కొన్ని హ్యాకింగ్ సంస్థలు అదనపు ప్రయోజనాలకు వాడుకుంటున్నాయి. ఏంటంటే.. ’మైక్రోసాప్ట్‌ విండోస్‌10 ఉచిత ట్రైలర్స్‌ని మీరు పొందాలనుకుంటున్నారా.. అయితే డౌన్‌ లోడ్ చేసుకోండి..’ అని మీ ఈ మెయిల్స్‌కి వస్తున్నాయా… అయితే వాటిని క్లిక్ చేయకండి.. ఎందుకంటే కొన్ని హ్యాకింగ్ సంస్థలు అలా డౌన్‌లోడ్ అని క్లిక్‌ చేయగానే మీ సిస్టమ్‌లోని వ్యక్తిగత సమాచారాన్ని హ్యాక్ చేస్తుందని ప్రముఖ మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థ సిస్కో హెచ్చరిస్తోంది. అందుకే తస్మాత్ జాగ్రత్త..!    

దీనిపై మైక్రోసాఫ్ట్‌ సంస్థ కూడా స్పందించింది. మా సంస్థ నుండి  ఏ యూజర్‌కి విండోస్10 ఆపరేటింగ్ సిస్టమ్‌ని డౌన్‌లోడ్ చేసుకోమని పంపలేదు. కంప్యూటర్ ఓనర్స్‌కి అప్‌డేట్ అని స్క్రీన్‌ పైనే వస్తుంది. ఈ మెయిల్ ద్వారా ఎవరికి రాదు. అందరూ గమనించాలి అని విన్నవించింది. వాటిని మాత్రమే డౌన్‌లోడ్ చేసుకోవాలని స్పష్టం చేసింది. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -