Wednesday, May 15, 2024
- Advertisement -

పవన్ సినిమా టైటిల్ ఇదే!

- Advertisement -

సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్పీడ్ పెంచాడు. వరస సినిమాలు చేయడానికి రెడి అవుతున్నాడు. సర్దార్ సినిమా ప్లాప్ కావడం వల్ల అభిమానులు నిరాశ చెందారు. అయితే ఈ సర్దార్ సినిమాని అభిమానులు త్వరగా మరిచిపోయేలా చేస్తే మంచిది అనే ఫీలింగ్ లో ఉన్నాడట పవర్ స్టార్. అందుకే వరస సినిమాలతో దూసుకెళ్తున్నాడు.

అందులో ముందుగా ఎస్ జే సూర్య సినిమాతో రాబోతున్నాడు. ఈ చిత్రంలో పవన్ కి జోడిగా శృతిహాసన్ హీరోయిన్ గా నటించబోతుందనే వార్తలు వస్తున్నాయి. ఇక ఈ చిత్రంలో పవన్ కడప ఫాక్షన్ లీడర్ గా కనిపించబోతున్నట్లు చెబుతున్నారు. దాంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు పెరిగిపోయాయి. ఈ చిత్రాన్నికి మొదటగా హుషారు అనే టైటిల్ అనుకున్న ఆ తర్వాత సేనాపతి అనే టైటిల్ ని కూడా అనుకున్నారట.

కానీ ఈ రెండు టైటిల్స్ కూడా అంతగా లేవు అని పక్కన పెట్టేశారట. ఈ మధ్యనే  “కడపకింగ్” అనే టైటిల్ ని రిజిస్టర్ చేయించినట్లు ఫిల్మ్ నగర్ లో వార్తలు వినిపిస్తున్నాయి. పవర్ స్టార్ ఇమేజ్ కు తగ్గట్లు ఈ టైటిల్ ఉంటుందని అనుకుంటున్నారట. అయితే ఇదే ఫైనల్ టైటిల్ అని అంటున్న ఇంకా అఫీషియల్‍గా మాత్రం ఎలాంటి విషయం బయటకు రాలేదు. ఇక ఈ చిత్రాన్ని ఈ ఇయర్ ఎండింగ్ లో కాని వచ్చే సంక్రాంతికి కానీ విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -