Sunday, May 19, 2024
- Advertisement -

పవన్ కి సూర్య కి మధ్య ఏం జరిగింది..?

- Advertisement -

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఎస్ జే సూర్య కాంబినేషన్లో సినిమా ఉంటుందని అనుకున్నారు అంతా. పవన్ కూడా సర్దార్ ప్లాప్ తర్వాత ఎలాంటి గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తున్నాడు అనుకున్నారు. పవన్, ఎస్ జే సూర్య కాంబినేషన్లో సినిమా మొదలు కూడా అయ్యింది. ఇక షూటింగ్ మొదలు కాబోతుందని అనుకున్న సమయంలో సడెన్ గా ఎస్ జే సూర్య ఈ చిత్రం నుంచి తప్పుకున్నాడు.

ఇలాగే గతంలో కూడా సర్దార్ సినిమాకి ముందుగా సంపత్ నంది ని తీసుకున్నారు. ఆ తర్వాత పవన్, సంపత్ మధ్య ఏవో మనస్పర్ధలు వచ్చి సర్దార్ సినిమా నుంచి సంపత్ తప్పుకున్నాడు. ఆ తర్వాత సర్దార్ ని డైరెక్ట్ చేసే చాన్స్ బాబీకి వచ్చింది. అయితే ఇప్పుడు ఎస్ జే సూర్య కూడా పవన్ సినిమా నుంచి ఎందుకు తప్పుకున్నాడు అని అందరు అనుకుంటున్నారు. అయితే పవన్, ఎస్ జే సూర్య కి మధ్య ఏవో గొడవలు జరిగడం వల్ల ఎస్ జే సూర్య ఈ చిత్రం నుంచి తప్పుకున్నాడు అని బయట టాక్ వినిపిస్తోంది.

అయితే పవన్ సన్నిహితులు మాత్రం ఎస్ జే సూర్య కి మహేష్ సినిమాలో అవకాశం రావడం వల్ల అతను ఈ చిత్రం నుంచి తప్పుకున్నాడు అని అంటున్నారు. మరి ఎస్ జే సూర్య తో పవన్ కి నిజంగా గొడవలు అయ్యాయో లేదో కాని బయట మాత్రం ఇద్దరి మధ్య ఏవో మనస్పర్ధలు వచ్చాయి అని రూమర్స్ వినిపిస్తున్నాయి. మరి ఈ విషయంలో ఎంత వరకు నిజం ఉందో పవన్, ఎస్ జే సూర్య లకే తెలియాలి. అయితే ఎస్ జే సూర్య ఈ చిత్రం నుంచి తప్పుకున్నాక ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేసే చాన్స్ డాలీకి అప్పగించినట్లు తెలుస్తోంది. అయితే ఎస్ జే సూర్య పవన్ చిత్రం నుంచి తప్పుకోవడం తో పవన్ సినిమా రావడాన్నికి మరింత టైం పట్టేలా కనిపిస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -