Monday, May 20, 2024
- Advertisement -

సునీల్ నో అన్నాడు కానీ చిరు మాత్రం ఓకే అన్నాడు!

- Advertisement -

చిరు 150 వ సినిమాలో సునీల్ నూ ఓ పాత్ర కోసం ఆడిగిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం సునీల్ డేట్స్ అడ్జెస్ట్ చేయలేక చిరు సినిమాకి నో చెప్పారు. ఆ తర్వాత చిరంజీవి సీన్ లోకి వచ్చినా ఫలితం లేకపోయింది. ఆ తర్వాత చిరు సునీల్ డేట్స్ అడ్జెస్ట్ చేయలేకపోతున్న విషయాన్ని అర్ధం చేసుకుని సరేలే అన్నారు. అయితే సునీల్ చిరు దగ్గరకి వెళ్లి తన చిత్రం ఆడియో వేడుకకు రమ్మని రిక్వెస్ట్ చేసాడట. అయితే చిరంజీవి వెంటనే వస్తా అని మాట ఇచ్చాడట.

సునీల్‌, మన్నారా చోప్రా హీరో హీరోయిన్స్ గా వంశీకృష్ణ ఆకెళ్ల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘జక్కన్న’. ఈ సినిమా ఆడియో పంక్షన్ ఈ రోజు సాయంత్రం హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో జరగనుంది. అయితే ఈ వేడుకకు ముఖ్య అతిథి మెగాస్టార్‌ చిరంజీవి వస్తున్నారు. ఈ విషయాన్ని ప్రముఖ నిర్మాత బీఏ రాజు ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు.

చిరుపై చాలా అభిమానమున్న సునీల్‌కి ఆయన చేతులమీదుగానే ఆడియో పంక్షన్ జరగడం మరింత ఉత్సాహాన్నిస్తుందంటున్నారు ఫ్యాన్స్. గతంలో సునీల్ నటించిన పూల రంగడు సినిమాలో సిక్స్ ప్యాక్ బాడీతో కనిపించిన అందరిని అలరించాడు. మళ్లీ జక్కన్నలో కూడా సిక్స్ ప్యాక్ బాడీతో కనిపించబోతున్నాడు. సో మొత్తాన్నికి సునీల్ చిరు సినిమాలో చేయకున్న ఆ విషయాన్ని మనసులో పెట్టుకోకుండా చిరు తనను ఇష్టపడే సునీల్ కోసం ‘జక్కన్న’ సినిమా ఆడియో వేడుకకు వస్తున్నాడు. 

{youtube}v=bhEhZnqKJFU{/youtube}

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -