Sunday, May 12, 2024
- Advertisement -

ఆ హీరోయిన్‍ పై చాలా కోపంగా పవన్ ఫ్యాన్స్!

- Advertisement -

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఇప్పుడు ఓ హీరోయిన్‍ పై చాలా కోపంగా ఉన్నారు. అమ్మడు వ్యవహారంలో చాలా గుర్రుగా ఉన్న వాళ్లు పనిలో పనిగా మీడియా వాళ్ల మీద కూడా తమ ఆగ్రహాన్ని వెల్లడిస్తున్నారు. ప్రస్తుతం పవన్ ఎస్ జె సూర్యతో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా కోసం హీరోయిన్ ఎవరిని తీసుకోవాలి అని చాలా రోజుల నుంచి వేతుకుతున్నారు.

పలానా హీరోయిన్ అంటూ వార్తలు రావడం.. వెంటనే ఆమె కాదు అని రావడం జరిగింది. తెలుగులో ఒక్క సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న కీర్తి సురేషన్ కు పవన్ తో చేసే అవకాశం వచ్చిందని కానీ అమ్మడు నో చెప్పింది అని వార్తలు వచ్చాయి.

నేను శైలజ సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన తమిళ హీరోయిన్ కీర్తి సురేషన్. ఈ అమ్మడుకు పవన్ కల్యాణ్ సూర్యతో చేస్తున్న తర్వాత ప్రాజెక్టులో హీరోయిన్ గా అవకాశం వచ్చినట్లు వార్తలు వచ్చాయి. కానీ కీర్తి మాత్రం అందుకు నో చెప్పింది అని తర్వాత వార్తలు వచ్చాయి. నానితో ఓ సినిమా చెయ్యడానికి మాత్రం ఈ బుద్దుగుమ్మ ఓకే చేసింది అనే వార్త అందరికి ఆశ్చర్యాన్ని కలిగించింది. నిజానికి పవన్ కళ్యాణ్ లాంటి పెద్ద హీరోలతో వచ్చే అవకాశాన్ని ఏ హీరోయిన్ కూడా వదులుకోదు. మరి అలాంటిది కీర్తి సురేషన్ ఎందుకు కాదంటుంది అనే దాని మీద పవన్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. అసలు కీర్తి సురేషన్ కు పవన్ సినిమాలో ఛాన్స్ వచ్చిందా..? ఇందతా మీడియా కావాలనే చేస్తున్న హడావిడియా అని వాళ్లు మండిపడుతున్నారు. ఒకవేళ అదే నిజమైతే.. నాని లాంటి చిన్న హీరోతో ఒప్పుకొని.. పవన్ లాంటి స్టార్ హీరోతో ఒప్పుకోకపోవడానికి కారణం ఏంటని అడుగుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -