Saturday, May 18, 2024
- Advertisement -

మెర్సాల్ రీమేక్ కి పవన్ కళ్యాణ్ ఓకే..? పెద్ద వివదాం అవుతుందా..?

- Advertisement -

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లో ఎక్కువ హిట్ సినిమాలు రీమేక్ ద్వారా వచ్చినవే. సుస్వాగతం దగ్గర నుంచీ మొన్న మొన్నటి కాటమరాయుడు వరకు పవన్ కళ్యాణ్ రీమేక్ సినిమాల మీద చూపించే ఆసక్తి ఒరిజినల్ కథల మీద చూపించడు.

రీసెంట్ గా తమిళం లో విడుదల అయ్యి బ్లాక్ బస్టర్ కలక్షన్ లతో మరొక పక్క భారీ కాంట్రవర్సీ తో నడుస్తున్న మేర్సాల్ సినిమా ని పవన్ రీమేక్ చేసే అవకాశం ఉంది అంటూ ఇంటర్నెట్ లో తెగ వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే తెలుగులో రిలీజ్ కావాల్సిన మెర్సాల్ తెలుగు వెర్షన్ ‘అదిరింది’ ఇంకా రిలీజ్ కాలేదు. దీంతో ఈ మూవీని పవన్ రీమేక్ చేస్తున్నాడు అనే రూమర్లు పుట్టుకొచ్చాయి. ఈ పుకార్లకి ఇంకో కారణం కూడా ఉంది.

ఈ మూవీ తెలుగు వెర్షన్ అదిరింది ని ఇక్కడ శరత్ మరార్ విడుదల చేయనున్నారు. శరత్ మరార్ తో పవన్ కి మంచి సాన్నిహిత్యం ఉంది. ఈ రీమేక్ లో చేయాలనే ఉద్దేశంతో ఉన్న పవన్.. ఆయనకి ఫోన్ చేసి తెలుగు వెర్షన్ ను హోల్డ్ లో పెట్టమన్నాడని చెప్పుకుంటున్నారు. శరత్ మరార్ సన్నిహితులు చెబుతున్న దాని బట్టి చూస్తే పవన్ కళ్యాణ్ అలాంటి ఆలోచనలో ఏమి లేడు అని తెలుస్తోంది. ఈ మూవీ ప్రభుత్వాన్ని ఎదిరించి, అనేక విషయాల మీద సీరియస్ ప్రశ్నలు లేవనెత్తిన కాన్సెప్ట్.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -