Tuesday, April 30, 2024
- Advertisement -

చంపేస్తారనే భయంతో మూడేళ్లు చెట్టు దిగలేదు.. అన్ని చెట్టు మీదనే..!

- Advertisement -

కొందరు మనుషుల ప్రవర్తన చూస్తే.. చాలా డిఫరెంట్ గా ఉంటుంది. అలాంటి న్యూస్ ఒక్కటి ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ అవుతోంది. చంపేస్తారనే భయంతో 47 ఏళ్ల వ్యక్తి 60 అడుగుల కొబ్బరి చెట్టు ఎక్కేశాడు. 2013 లో చెట్టెక్కాడు.. మూడేళ్లవరకు చెట్టు దిగలేదు. అయితే తాజాగా అక్కడ ప్రభుత్వం ఆ విషయాన్ని తెలుసుకోని రెస్క్యూ టీమ్ ద్వారా అతని కిందకు దించారు. నమ్మడానికి ఇది కొంచెం అనుమానంగా ఉన్నప్పటికి ఇది నిజం.

అసలు విషయంలోకి వెళ్తే.. ఫిలిప్పీన్స్‌లోని గిల్బెర్ట్‌ సాంచెజ్‌ అనే 47 ఏడేళ్ల వ్యక్తి తనను ఎవరో చంపడానికి చూస్తున్నారని 2013 లో కొబ్బరి చెట్టు ఎక్కేశాడు. కిందకి దిగితే చంపేస్తారు అని అక్కడే ఉండిపోయాడు. అతని కుటుంబ సభ్యులు ఎంత బ్రతిమిలాడిన కిందకు దిగలేదు. పైకి ఎవరైన వచ్చే ప్రయత్నం చేస్తే కిందకు దూకి చనిపోతానని అందరిని భయపెట్టాడు. దీంతో అందరు గిల్బెర్ట్‌ ను బ్రతి మాలి అలసిపోయారు. అతని తల్లి మూడేళ్ల నుంచి రోజు బ్రతిమాలుతూనే ఉంది అయినా ఏ రోజు అతను మాట వినలేదు. ఆ ప్రాంతంలో ఒకప్పుడు జరిగిన గొడవలల్లో ఒక వ్యక్తి తుపాకీతో భయపెట్టి అతని తలపై కొట్టడం వల్ల అతనికి మతి చెందిందని గిల్బెర్ట్‌ తల్లి తెలిపింది. అయితే అతనికి ఒక తాడు ద్వారా తినడానికి ఆహారం, మార్చుకోవడానికి బట్టలు ఇచ్చేవాళ్లం అని తెలిపింది. మూడేళ్లుగా అతను చెట్టుపైనే నిద్రించేవాడు.

దాంతో అతనికి చర్మ వ్యాధులు వచ్చాయి. అలానే శరీరం నుండి దుర్వాసన కూడా వచ్చేది. సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ కావడంతో ప్రభుత్వం వెంటనే స్పందించి 50 మందితో కూడిన రెస్క్యూ టీం ద్వారా అతన్ని సురక్షితంగా కిందికి దించి వెంటనే హాస్పిటల్ కి తలరించింది. దీంతో అతను మూడేళ్ల తర్వాత నేలను తాకాడు. అతని కుటుంబం కూడా చాలా సంతోషంగా ఫీల్ అయింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -