- Advertisement -

ఆ సినిమా చేతులు మారడం వెనుక పవన్ రాజకీయం ఉందా?

- Advertisement -

పవన్ రాజకీయం ప్రజలకు ఎంత ఉపయోగపడింది అంటే ఎవ్వరూ సమాధానం చెప్పలేని పరిస్థితి. చంద్రబాబుకు మాత్రం చాలానే హెల్ప్ అయింది. 2014 ఎన్నికల్లో మోడీ, బాబులకు ఓట్లు ఎక్కువ పడడం వెనకాల….జగన్‌పై బాబు గెలవడానికి ప్రధాన కారణం పవన్ అని చెప్పొచ్చు. ఇక పవన్‌కి కూడా లాభాలు బాగానే ఉన్నాయి. ఇద్దరు చంద్రులతోనూ సన్నిహిత సంబంధాలు ఉన్న నేపథ్యంలో తన సినిమాలతో పాటు మెగా ఫ్యామిలీ సినిమాలన్నింటికీ పర్మిషన్స్, అధికారికంగా, అనధికారికంగా ఎక్స్‌ట్రా షోలు, ట్యాక్స్ విషయాల్లో బేఫికర్‌గా ఉండొచ్చు. తెరవెనుక ప్యాకేజీల గురించి కూడా అందరికీ తెలిసిన విషయమే. ఇక పూనం కౌర్ వ్యవహారంతో తన వాళ్ళకు ప్రభుత్వం నుంచి సహాయం దక్కేలా పవన్ చాలానే చేస్తున్నాడన్న విషయం అర్థమైంది. ఇక చిరంజీవిని టిడిపి నుంచి రాజ్యసభ పదవికి ఎంపిక చేయమని కూడా బాబును గట్టిగా అడుగుతున్నాడు పవన్.

ఆ విషయాలు పక్కనపెడితే ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో కూడా తన రాజకీయ బలాన్ని చూపించాడట పవన్. తన మేనల్లుడు…..అన్నీ తానై చూసుకుంటున్న హీరో సాయిధరమ్ తేజ్ వరుసగా నాలుగు ఫ్లాప్స్ ఎదుర్కున్న నేపథ్యంలో మార్కెట్ పూర్తిగా డౌన్ అయింది. ఎలా అయినా సాయిని మళ్ళీ హీరోగా నిలబెట్టాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో పవన్ రంగంలోకి దిగాడట. నేను….శైలజ లాంటి సూపర్ హిట్ ఇచ్చి ప్రామిసింగ్ డైరెక్టర్ అనిపించుకున్న తిరుమల కిశోర్ అయితే సాయి ధరమ్ శైలికి కరెక్ట్‌గా సరిపోతాడని చెప్పి ఆ డైరెక్టర్‌తో సాయి సినిమాను ఫిక్స్ చేశాడట. అయితే అప్పటికే ఆ డైరెక్టర్‌తో సినిమా చేయడానికి నానీ కమిట్ అయి ఉన్నాడు. షూటింగ్‌కి వెళ్ళేదశలో ఉన్నారు. అయితే పవన్ వైపునుంచి పై స్థాయిలో రాజకీయ ఒత్తిడి కూడా రావడంతో ప్రాజెక్ట్ వదులుకోకతప్పలేదట నానీకి. ఇప్పుడు ఇదే విషయంపై స్వతహాగా ఎదిగిన ఇతర యువ హీరోలు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారని తెలుస్తోంది. ఒక హీరో కమిట్ చేయించుకున్న ప్రాజెక్ట్‌ని కేన్సిల్ చేసి మరీ బలం బలగం ఉన్నాయని చెప్పి వంశం పేరు చెప్పుకునే హీరోలు హల్చల్ చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారట. అలాంటి వాళ్ళు ఎంతమంది ఏం ప్రశ్నిస్తే ఏం లాభం? అభిమానుల బలం పుష్కళంగా ఉన్న నేపథ్యంలో….రాజకీయ, ఆర్థిక బలం కూడా గట్టిగా ఉన్న హీరోలను ఎవరు మాత్రం ఎదుర్కోగలరు? మన దగ్గర వ్యవహారం అంతా కూడా బలవంతుడే బ్రతకాలనే సూక్తి మరవకుండా…..శతాబ్ధాలు నడవలేదా ఈ అరణ్య కాండ అనే టైప్ కదా.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -