Wednesday, May 8, 2024
- Advertisement -

ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ నాయకుడి తండ్రి(65) రేప్ చేశాడుః 19ఏళ్ళ యువతి ఆవేదన

- Advertisement -

నీచం అనాలా? మనుషులేనా అనాలా? ప్రజల ఓట్ల బలంతో గద్దెనెక్కి ఆ ప్రజలనే రాక్షసుల్లా కబలిస్తున్నారని అనుకోవాలా? ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న పార్టీ అధినాయకుడు అన్నీ ఇన్నీ నీతులు చెప్పడు. పిల్లలను ఎలా పెంచాలి, ఎలా చదివించాలి నుంచీ ఎవరు ఎలా బ్రతకాలో కూడా హితబోధ చేస్తూ ఉంటాడు. కానీ ఆయన పుత్రరత్నమే మందు పార్టీలు, అర్థనగ్నంగా ఉన్న అమ్మాయిలతో అదో రకం ఫొటోలు……..అబ్బో సుఖపురుషుడు అన్న రేంజ్‌లో అవుట్ పుట్ ఉంటుంది. అదేంటి అని ప్రశ్నించిన మీడియాతో…..‘వాటికే ఇంత బిల్డప్పా……అలాంటివి ఇంచా చాలా ఉన్నాయి……ఫారెన్‌లో కామన్’ అన్నట్టుగా మాట్లాడేస్తాడు. ఇక అధికార పార్టీ మంత్రుల కొడుకులు, మంత్రి వర్యుల వ్యవహారాలు చూస్తూనే ఉన్నాం.

పై వాళ్ళే ఆ స్థాయిలో రెచ్చిపోతే సెకండ్ గ్రేడ్ నాయకులు ఏ స్థాయిలో రెచ్చిపోతారో ప్రత్యేకంగా చెప్పాలా? ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా? ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ నాయకుడు….ఆంధ్రప్రదేశ్ ఆప్కో ఛైర్మన్ శ్రీనివాస్ తండ్రి రామకృష్ణ తన మనవరాలి వయసు ఉన్న 19 ఏళ్ళ అమ్మాయి జీవితాన్ని సర్వనాశనం చేశాడు. తల్లిదండ్రులు చనిపోవడంతో దిక్కూమొక్కూ లేకుండా ఉన్న ఆ అమ్మాయికి దుస్తుల పరిశ్రమలో ఉద్యోగం ఆశ చూపించాడు. ఆ తర్వాత ఆ ఉద్యోగంలోంచి తీసేస్తానని బెదిరిస్తూ ఆ అమ్మాయి తన దగ్గర భయంతో ఉండేలా చేసుకున్నాడు. ఆ క్రమంలోనే వావి వరసలు మరిచి…..మనవరాలి వయసున్న ఆ అమ్మాయిని బలవంతంగా అత్యాచారం చేశాడు. ఆ తర్వాత ఆ అమ్మాయి నగ్నంగా ఉన్న ఫొటోలు, వీడియోలు తీశాడు. వాటిని అడ్డుపెట్టుకుని బ్లాక్ మెయిల్‌కి దిగాడు. బెదిరించి అనుభవించడం మొదలెట్టాడు. ఆ తన రాజకీయ అవసరాల కోసం, స్వార్థ ప్రయోజనాల కోసం ఇతరుల దగ్గరకు కూడా ఆ అమ్మాయిని పంపించడం మొదలెట్టాడు. ఆ నరకాన్ని తట్టుకోలేని ఆ అమ్మాయి ఆంధ్రప్రదేశ్‌లో ఈ దుర్మార్గాన్ని ప్రశ్నిస్తే ఏమవుతుందో తెలుసు కాబట్టే………హైదరాబాద్ వచ్చి సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో అధికార పార్టీ నాయకుడి తండ్రి నరకాసుర రూపాన్ని ససాక్ష్యంగా వివరించింది.

షరామామూలుగానే మీడియా ఆధిపత్యం ఉన్న పార్టీ కావడంతో ఈ విషయం కనీసం ప్రజలకు కూడా తెలియకుండా మేనేజ్ చేయడం గ్యారెంటీ. మరిక నిప్పుని అని చెప్పుకునే వాళ్ళు తల్లీతండ్రీ లేని అమ్మాయికి న్యాయం చేయడం తర్వాత………కనీసం రక్షణ అయినా కల్పిస్తారా? అయినా ఎమ్మార్వో స్థాయి అధికారిణి జుట్టుపట్టుకుని కొట్టినప్పుడే…….తన పార్టీ నేతది తప్పు కాదు…….ఎమ్మార్వోదే తప్పు అని సూత్రీకరించిన అధినేత నుంచి ఇప్పుడు మాత్రం మరోలాంటి ప్రతిస్పందన ఆశించగలమా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -