Tuesday, May 21, 2024
- Advertisement -

పాసులు లేవా? అయితే రావద్దు!

- Advertisement -

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా ఆడియో వేడుకకు అంత సిద్దం అయింది. ఈ నెల 20న హైదరాబాద్‍లో నోవోటెల్ హోటల్ లో ఈ వేడుక అద్భుతంగా జరగనుంది.

ఈ వేడుకకు సంబంధించి ఈ రోజు పవన్ కళ్యాన్ ప్రేస్ మీట్ పెట్టాడు. దయ చేసి పాసులు లేని అభిమానులు ఎవ్వరూ కూడా ఆడియో వేదిక దగ్గరకు రావొద్దు. మీరు ఇంటి దగ్గరే ఉండి టివిల్లో చూడండి అని చెప్పుతున్నాడు. అలాగే ఈ ఆడియో వేడుకకు అన్నయ్య వస్తున్నారు అతని చేతుల మీదిగా ఆడియో వేడుక జరుగుతుందని చెప్పుతున్నాడు.

దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో పవన్ సరసన కాజల్ హీరోయిన్‍గా నటిస్తుండగా బాబీ దర్శకత్వం వహిస్తున్నాడు. భారీ అంచనాలు ఉన్న ఈ సినిమాని వచ్చేనెల రిలీజ్‍కి ప్లాన్ చేస్తున్నారు. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -