Tuesday, May 7, 2024
- Advertisement -

మరో మెగా హీరో సరసన కాజల్

- Advertisement -

భారీ సినిమాలతో వరస అవకాశాలతో దూసుకెస్తుంది అందల భామ కాజల్. ప్రస్తుతం ఈ ముద్దు గుమ్మ  మహేష్ బాబు తో బ్రహ్మోత్సవం, పవన్ కళ్యాణ్ సరసన సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాల్లో నటిస్తుంది. అలాగే కొన్ని బాలీవుడ్  సినిమాలో కూడా నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది. ప్రస్తుతం  పవన్ కళ్యాణ్ సరసన సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా రిలీజ్‍కు రెడి అవుతుంది.

ఇవే కాక ఈ భామకి మరో బంఫర్ ఆఫర్ వచ్చింది. యువ హీరో వరుణ్ తేజ్ త్వరలో శ్రీనువైట్ల దర్శకత్వంలో ఓ సినిమాలో నటించబోతున్నాడు. ఇందులో వరుణ్‍కి సరసన  హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ ఏంపికా చేశారట. ఇప్పటి వరకు  ఎక్కువగా సీనియర్ హీరోలతో నటించిన ఈ అమ్మడు వరుణ్ తేజ్ సరసన నటించబోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

ఇప్పటికే మెగా హీరోలైన పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్ లతో జతకట్టిన ఈ అమ్మడు తాజాగా మరో మెగా హీరోతో జోడి కట్టడం విశేషంగా చెప్పుకుంటున్నారు. ఏప్రిల్ 8న ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనున్నది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -