Tuesday, May 21, 2024
- Advertisement -

డైరెక్టర్ లేకుండా నే పవన్ షూటింగ్ చేస్తున్నాడు

- Advertisement -

సర్దార్ గబ్బర్ సింగ్ టాకీ పార్ట్ మొత్తం పూర్తి చేసిన పవన్ కళ్యాణ్ మరియూ అతని బృందం ఇప్పుడు స్విట్జర్ లాండ్ వెళ్ళిన విషయం తెలిసిందే. అక్కడ నాలుగు అంటే నాలుగే రోజులలో షూటింగ్ చేసి సాంగ్ ని కంప్లీట్ చెయ్యబోతున్నారు. ఈ పాట దాదాపుగా పూర్తి అవ్వోచ్చింది అని తెలుస్తోంది.

పవన్ కళ్యాణ్ స్వయంగా ఎక్స్ట్రా కేర్ తీసుకుని మరీ ఈ డ్యూఎట్ సాంగ్ ని పూర్తి చేసాడు. డైరెక్టర్ బాబీ లేకుండానే ఈ పాటలు షూటింగ్ జరుగుతోంది. పవన్ కళ్యాణ్ సరసన కాజల్ డాన్స్ చేస్తూ ఉంటే లోకల్ గా ఉండే తెలుగు వాళ్ళు చాలా మంది పవన్ ని చూడడం కోసం ఒస్తున్నారు. పాటల షూటింగ్ పూర్తయిపోయిన తర్వాత సర్దార్ లో ప్రిన్సెస్ గా నటిస్తున్న కాజల్ తో.. మన గబ్బర్ సింగ్ తన స్టైల్ లో ఓ ఫోటో దిగాడు.

ప్రస్తుతం హైద్రాబాద్ లో ఉన్న డైరెక్టర్ బాబీ.. ఫస్ట్ కాపీని సిద్ధం చేసేందుకు ఎడిటింగ్ టేబుల్ దగ్గర బాగా యాక్టివ్ గా ఉన్నాడని తెలుస్తోంది. ఈ రెండు పాటలను కూడా యాడ్ చేసేసి… నెలాఖరు కల్లా ఫస్ట్ కాపీ రెడీ చేసేయాలన్నది సర్దార్ టీం టార్గెట్. ఏప్రిల్ 2న సెన్సార్ కంప్లీట్ చేసేందుకు నిర్మాత శరత్ మరార్ సిద్ధమవుతున్నాడు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -