Friday, May 10, 2024
- Advertisement -

కొడుకులని పట్టించుకోవడం మానేసిన నాగార్జున ??

- Advertisement -

హీరో నాగార్జున ప్రస్తుతం వరస పెట్టి హిట్ ల మీద హిట్ లు కొడుతున్నారు. మనం, సోగ్గాడే చిన్ని నాయన లతో సూపర్ హిట్ లు ఇచ్చిన నాగార్జున ఈ మధ్యన ఊపిరి తో కొత్త సెన్సేషన్ కి తెర లేపారు. ఓవర్ సీస్ నుంచి దేసీ మార్కెట్ వరకూ ఈ సినిమా ఇప్పుడు పెద్ద హిట్ అయ్యి కూర్చుంది. సోగ్గాడు తోనే కుర్ర హీరోల మాస్ రికార్డులు తుడిచేసిన నాగార్జున ఇప్పుడు ఈ సినిమాతో ఎన్ని రికార్డులు బ్రేక్ చేస్తారో చూడాలి. అయితే నాగార్జున విషయం లో ఆయనకి పెద్ద లోటు ఏంటంటే కొడుకులు తనలాగా రాణించలేక పోవడమే. 

ఒక పక్క చిరంజీవి కొడుకు రాం చరణ్ తేజ హిట్ తో సంబంధం లేకుండా మార్కెట్ లో ప్లాప్ అయినా హిట్ అయినా నలభై కోట్లు లాగేస్తూ ఉండగా నాగార్జున మాత్రం తన కొడుకులకి మంచి హిట్ ఇవ్వలేక పోతున్నాడు. నాగ చైతన్య ఏదో బండి లాగించేస్తున్నాడు అనుకుంటే అఖిల్ ని అక్కినేని నట వారసుడిగా ఇంట్రో చెయ్యాలి అని ప్లాన్ చేసిన నాగార్జున కి మొదటి చిత్రం అఖిల్ పెద్ద దెబ్బ తగిలింది. ఇప్పుడు చిన్న కొడుకు  రెండవ సినిమా విషయం లో మీమాంస లో ఉన్నాడు నాగార్జున .

అలాగే పెద్ద కొడుకు సినిమా సాహసం శ్వాసగా సాగిపో సినిమా విడుదల కి అంతా సిద్దం అయ్యి ఆగిపోగా ఆ విషయం లో కూడా ఏమీ పట్టించుకోవడం లేదు అంటున్నారు. ఇప్పుడే కెరియర్ స్టార్ట్ చేసిన తన కొడుకుల భవిష్యత్ గురించి నాగార్జున తగిన చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. అసలు ఈ రెండు మూడు నెలల కాలంలో వారి గురించి కాని వారి సినిమాల గురించి కాని పట్టించుకున్న దాఖలాలు లేవు. మరి ఇలా అయితే నాగ్ వారసులుగా వారు ప్రేక్షకాదరణ పొందడం కష్టమే అవుతుంది. సో ఇప్పటికైనా నాగ్ తన కొడుకులను పట్టిచుకుంటే బెటర్.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -