పవన్ అభిమానులు ఎంతగానో ఎదురు చుస్తున్న సినిమా ‘సర్దార్ గబ్బర్ సింగ్’. ఈ సినిమా మొదలు పెట్టిన దగ్గర నుండి సమస్యలే. గబ్బర్ సింగ్ పెద్ద హిట్ అవ్వడంతో దానికి సిక్వెల్ గా ‘సర్దార్ గబ్బర్ సింగ్’ సినిమా మొదలు పెట్టారు. కానీ ఈ సినిమా షూటింగ్ కొన్ని రోజులు జరిగితే ఇంకోన్ని రోజులు వాయిదా పడుతుంది.
పవన్ హీరోగా అత్తారింటికి దారేది సినిమా వచ్చి రెండు సంవత్సరాలుపైనే అయింది. మధ్య లో ‘గోపాల గోపాల’ వచ్చిన అందులో పవన్ అతిథి పాత్ర మాత్రమే పోషించాడు. ఈ మధ్య పవన్ బుల్లితెర మీద కనిపిస్తాడు అనే వార్తా సినీ పరిశ్రమలో హాల్చల్ చేస్తున్న విషయం తెలిసిందే.
అమీర్ ఖాన్ షో ‘సత్యమేవ జయతే’ తరహాలో బుల్లితెరపై ఓ షోకు పవన్ హోస్ట్‌గా చేస్తాడని వార్తలు వస్తున్నాయి. ఒకవేళ పవన్ ఈ షో చేస్తే ‘సర్దార్ గబ్బర్ సింగ్’ సమ్మర్‌కి రావడం మరింత లేట్ అవుతుంది.
ఐతే పవన్ సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాకి కొంత బ్రేక్ తీసుకొని రామోజీ ఫిలిం సిటీలో జరిగే ఈ షో షూటింగ్‌లో పాల్గొనడానికే సిద్ధమవుతున్నాడు అనే వార్తాలు వస్తున్నాయి. పవన్ అభిమానులు మాత్రం సర్దార్ సినిమా షూటింగ్ తొందరగా కాంప్లీట్ చేసి సమ్మర్ లో రిలీజ్ చేయాలి అని కోరుకుంటున్నారు.
