Monday, May 13, 2024
- Advertisement -

కమెడియన్ కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన పవన్ కళ్యాణ్

- Advertisement -

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ కాంబో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ మూవీ షూటింగ్ టైంలో పవన్ కళ్యాణ్ ఓ కమెడియన్ కు స్ట్రాంఘ్ వార్నింగ్ ఇచ్చినట్లు టాలీవుడ్ వర్గాల నుంచి సమాచారం. తెలుస్తున్న సమాచారం ప్రకారం.. షూటింగ్ మధ్యలో పవన్, త్రివిక్రమ్ లు స్టోరీ డిస్కషన్ లో సీరియస్ గా ఉన్నారట.

తనదైన శైలిలో పవన్..క్యారక్టరైజేషన్ లో ఇంప్రవైజేషన్స్ చేస్తున్నారట. ఈలోగా వారి మధ్యకు వెళ్లిన ఓ కమెడియన్.. జనసేన విషయాలు గురించి ప్రస్తవించాడట. దాంతో పవన్ కి తెగ కోపం వచ్చి.. అతడిపై మండిపడినట్టు తెలుస్తోంది. తన హద్దుల్లో ఉండమని.. లిమిట్స్ దాటోద్దు అని ఆ కమెడియన్ ను పవన్ హెచ్చరించినట్లు తెలుస్తోంది. . దాంతో పవన్ కు అంతలా కోపం తెప్పించిన ఆ కమిడియన్ నెక్ట్స్ షెడ్యూల్ నుంచి సినిమాలో ఉంటాడో, ఉండడో అనదే చర్చగా మారింది.

మరి ఆ కమెడియన్ ఎవరనే విషయంపై క్లారిటీ రాలేదు కానీ.. కొందరు చెప్పుకునే దాని ప్రకారం.. గతంలో త్రివిక్రమ్, నితిన్ కాంబినేషన్ లో వచ్చిన ‘అఆ’ సినిమాలో ఆ కమీడియన్ ఫుల్ లెంత్ రోల్ చేశాడని అంటున్నారు. ఆ సినిమాలో ఆ హాస్యనటుడు క్యారెక్టర్ పండటంతో పవన్ సినిమాలో కూడా త్రివిక్రమ్ ఛాన్స్ ఇచ్చాడని తెలుస్తోంది. అతనికే ఇప్పుడు పవన్ తనదైన స్టైల్ లో వార్నింగ్ ఇచ్చాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. అంత పెద్ద స్టార్ హీరో, స్టార్ డైరెక్టర్ మాట్లడుకుంటుంటే..మధ్యలో వెళ్లి కెలకడం ఎందుకు.. వార్నింగ్ ఇప్పించుకోవడం ఎందుకు అని అంటున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -