Friday, May 17, 2024
- Advertisement -

మాధవీలత లవర్ ని.. ఆమె ఏం చేసిందో తెలుసా..?

- Advertisement -

అమ్మాయిలు, అబ్బాయిలు ప్రేమలో పడటం మాములే. లవ్ విషయంలో కొందరు బయటపడితే.. మరి కొందరు బయటపడరు. లవ్ లో సక్సెస్ అయ్యారా లేదా అనేది తర్వాతి విషయం.. కానీ ఇలాంటివి మాత్రం ప్రతి ఒక్కరి లైఫ్ లో ఉంటాయి. తన లైఫ్ లోనూ ఇలాంటి లవ్ మెమొరీస్ ఉన్నాయి అంటోంది తెలుగు హీరోయిన్ మాధవీ లత. రీసెంట్ గా ఓ ఇటర్వ్యూలో ఆమె తనకు ఓ అబ్బాయి లవ్ ప్రపోజ్ చేసిన సంగతిని బయటపెట్టింది. సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టిన తర్వత హైదరాబాద్ లో ఒకబ్బాయితో స్నేహం ఏర్పడింది. అతను చాలా మంచి వ్యక్తి. నా పట్ల చాలా కేర్ తీసుకునే వాడు. కొన్ని రోజుల తర్వాత లవ్ ప్రపోజ్ చేశాడని మాధవీ లత తెలిపారు. అతను ఈ విషయం చెప్పిన తర్వాత వెంటనే షాక్ అయ్యాను. ఎందుకంటే అప్పటి వరకు అతడిని నేను కేవలం ఫ్రెండుగా మాత్రమే చూశాను. నాకు అలాంటి అభిప్రాయం లేదని అతడికి తేల్చి చెప్పినట్లు మాధవి లత తెలిపారు. నేను అలా చెప్పగానే…. నీ అభిప్రాయం నీది. నీ ఫీలింగ్ నీది. నన్ను ప్రేమించమని ఫోర్స్ చేయడం లేదన్నాడు. నేను వెంటనే ఇద్దరం ఫ్రెండ్స్ లా ఉందామని చెప్పాను. కానీ అతడు నేను నిన్ను ఫ్రెండుగా ఎప్పుడూ ఊహించుకోలేదు, అందుకే అలా ఉండటం నా వల్ల కాదు, లవర్ గానే చూస్తానని చెప్పాడని….మాధవి లత తెలిపారు. ఏ అమ్మాయిని ప్రేమించిన.. ఆమె నో చెప్పితే.. ఫ్రెండ్ గా కంటిన్యూ అవుతాను అనే అబ్బాయిది నిజమైన ప్రేమ కాదు. నువ్వు నన్ను ఫ్రెండుగా చూసినా, నా మనసులో నువ్వు ఎప్పుడూ లవర్‌గానే ఉండిపోతావు అన్నాడు. నన్ను ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నించలేదు. అతడు చెప్పిన మాట నాకు బాగా నచ్చింది అని మాధవి లత తెలిపారు. అతడు చెప్పిన మాటలకు ఏం చేయాలో అర్థం కాలేదు. నేను అతడితో ఫ్రెండ్షిప్ కంటిన్యూ చేస్తే, నాపై అతడి ప్రేమ కూడా కంటిన్యూ అవుతుందని….. కావాలనే కొన్ని బాధ పెట్టే విషయాలు మాట్లాడి అతడి ఇగోను హర్ట్ చేశాను. నేను చేసింది తప్పే అయినా అతడికి ఇప్పటికీ సారీ చెప్పలేదు అని మాధవి లత తన పాత విషయాలను చెప్పింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -