Tuesday, June 18, 2024
- Advertisement -

OG కోసం పవన్ మార్షల్ ఆర్ట్స్!

- Advertisement -

సుజీత్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ఓజీ. 1950 కాలం నాటి బ్యాక్‍డ్రాప్‍లో ముంబైలో గ్యాంగ్‍స్టర్స్ యాక్షన్ డ్రామా నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. పవర్‌ఫుల్ గ్యాంగ్ స్టర్‌గా పవన్‌ కనిపించనుండా పాన్ ఇండియా లెవల్లో ఓజీ రిలీజ్ కానుంది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌లో పాల్గొననున్నారు పవన్.

ఇప్పటికే OG నుండి వచ్చిన పోస్టర్స్, గ్లింప్స్ సినిమాపై భారీ అంచనాలను పెంచేయగా తాజాగా ఓ ఆసక్తికర వార్త టీ టౌన్‌లో వైరల్‌గా మారింది. ఈ సినిమా కోసం మరోసారి మార్షాల్ ఆర్ట్స్‌లో జాయిన్ అయ్యారట. ఈ విషయాన్ని దర్శకుడు సుజీత్ స్వయంగా వెల్లడించారు.

ఓజీలో ఓ ఫైట్ సీన్ కోసం పవన్.. పూణే, ముంబై నుంచి ఐకిడో మాస్టర్స్ ని తీసుకొచ్చి దాన్ని ప్రాక్టీస్ చేశారన్నారు. అలాగే ఐకిడో కి సంబంధించి కొన్ని వీడియోలు, సినిమాలు కూడా చూశారన్నారు. ఇక పవన్‌కు ఏదైనా ఇంట్రెస్టింగ్‌ కనిపిస్తే దాని గురించి తెలుసుకోవడానికి ఇష్టపడతారని చెప్పారు. ఇక సుజీత్ చెప్పిన ఈ వార్త పనవ్ ఫ్యాన్స్‌లో జోష్ నింపింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -