Wednesday, May 22, 2024
- Advertisement -

అభిమానుల కోసం పవన్ ఏం చేస్తున్నాడో తెలుసా?

- Advertisement -

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా నటించిన చిత్రం సర్దార్ గబ్బర్ సింగ్ ఆడియో ఇటీవలే విడుదల అయ్యింది. పవన్ సరసన కాజల్ హీరోయిన్‍గా నటిస్తున్న ఈ సినిమాకి బాబీ దర్శకత్వం వహించగా దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఐతే ఈ సినిమాకి సంబంధించి థియేట్రికల్ ట్రైలర్ అందరిని నిరాశా పరిచింది.

ముఖ్యంగా ఈ ట్రైలర్ లో పవన్ పంచ్ పవర్ లేదంటూ ఏమాత్రం ఆసక్తి కరంగా లేదని విమర్శలు వస్తున్నాయి. అలాగే హిందిలో రిలీజ్ చేసిన ట్రైలర్ కు కూడా ఇలాగే రెస్పాన్స్ వస్తొంది. ఐతే తాజాగా పవన్ దగ్గరికి ఈ విషయలు వెళ్ళాయట. దీంతో పవన్ తన అభిమానులను అనందపరచడానికి మరో అద్భుతమైన ట్రైలర్ ను రెడీ చేస్తున్నారట.

పవన్ పంచ్ డైలాగ్ లతో ఉండనున్న ఈ ట్రైలర్ ను ఈ శుక్రవారం విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట. మరి ఈ ట్రైలర్ తో అయిన పవన్ ఆకట్టుకుంటాడా లేదా అనేది తెలియాలంటే రేపటి వరకు ఆగాల్సిందే! వచ్చే నేలలో ఈ సినిమాని రిలీజ్ చేయనున్నారు. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -