Monday, May 6, 2024
- Advertisement -

పార్టీ ఇన్ టోక్యో

- Advertisement -

ఇదేదో ఇంగ్లీషు సినిమా టైటిల్ అనుకుంటున్నారా. ముమ్మాటికి కాదు. గుంటూరు ఎంపి, సూపర్ స్టార్ కృష్ణ అల్లుడు గల్లా జయదేవ్ తన పుట్టిన రోజు వేడుకలు టోక్యోలో చేసుకుంటున్నారు. ఇదీ విషయం. ఈ పార్టీకి దగ్గుబాటి రానా, తన తోడల్లుడు, నటుడు సుధీర్ బాబుతో పాటు కుటుంబ సభ్యులు, మిత్రులు అంతా కలిసి ఓ 60 మంది టోక్యోకి వెళ్లారు.

తన నియోజకవర్గంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాజధానికి నిధులు లేక దాదాపు అడుక్కుతినే పరిస్ధితి ఉంటే గల్లా వారు మాత్రం తన పుట్టిన రోజు పార్టీకి టోక్యో వెళ్తున్నారు. వీళ్లు మన నాయకులు. ఈ పార్టీ పేరుతో కనీసం ఓ పది కోట్లు అయినా ఖర్చు అవుతుందని అంచనా. పైసా కూడా లేక ముఖ్యమంత్రి చంద్రబాబు నెట్టుకొస్తూంటే జయదేవుడి పార్టీ సమంజసమేనా…

తన పుట్టిన రోజు నాడు టోక్యోలో ఖర్చు చేసే ఆ డబ్బులు రాజధాని కోసం ఇస్తానని ప్రకటిస్తే ఎంత బాగుండేది. పేరుకు పేరు… వచ్చే ఎన్నికల్లో విజయానికి ఓ ధీమా దక్కేవి కదా.. అర్ధం చేసుకోరూ… గల్లా వారి గల్లాపెట్టె నిండా డబ్బులుంటే ఇలాంటి వేషాలెందుకు చెప్పండి. వాడు మగాడ్రా బుజ్జీ అన్నట్లు వీళ్లు మారర్రా బుజ్జీ….

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -