Sunday, April 28, 2024
- Advertisement -

21 ఏళ్లకే..పాయల్ పోస్ట్ వైరల్!

- Advertisement -

పాయల్ రాజ్‌పుత్..అందాల హద్దులను చెరిపేయడంలో దిట్ట. సీరియల్ నటిగా కెరీర్‌ని ప్రారంభించిన పాయల్..ఓ పంజాబీ చిత్రంతో సిల్వర్ స్క్రీన్‌కి పరిచయమైంది. ఇక టాలీవుడ్‌కు ఆర్‌ఎక్స్ 100తో డెబ్యూ ఇచ్చిన ఈ బ్యూటీ తొలి సినిమాతో మంచి మార్కులు కొట్టేసింది. ఆ తర్ఆవత వరుసగా అవకాశాలు క్యూ కట్టాయి. అయితే పాయల్ నటించిన సినిమాలేవి పెద్దగా బాక్సాఫీస్ వద్ద వసూళ్లను రాబట్టలేకపోయాయి.

ఇక తనకు డెబ్యూ అవకాశం ఇచ్చిన దర్శకుడు అజయ్ భూపతిపై నమ్మకంతో మంగళవారం సినిమా చేసింది పాయల్. శృంగార కోరికలతో సతమతమయ్యే అమ్మాయి పాత్రలో నటించి మెప్పించింది. ఈ మూవీతో తిరిగి సక్సెస్ బాటపట్టింది.

ఈ సినిమా తర్వాత ప్రస్తుతం తమిళంలో రెండు సినిమాలు చేస్తుండగా ఈ సందర్భంగా తన కెరీర్ బిగినింగ్‌ను గుర్తు చేసుకుంది. 21 వయసులో ఒక మ్యాగజైన్ కోసం ఫస్ట్ ఫోటో షూట్ చేశానని..అప్పటి ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -