Friday, May 17, 2024
- Advertisement -

మరో సంచలనం… మహేష్ కత్తి వెనకాల పూనం కౌర్ హస్తం ఉందా…?

- Advertisement -

మహేష్ కత్తి మామూలోడు కాదు. ప్రెస్ మీట్ సందర్భంగా కూడా పవన్ కళ్యాణ్‌పై షరా మామూలుగా ఏవో కొన్ని విమర్శలు చేసి మమ అనిపించేస్తాడు అనుకుంటే దిమ్మ తిరిగే నిజాలను బయటపెట్టేశాడు మహేష్ కత్తి. ఆ దెబ్బతో పవన్ హార్డ్ కోర్ ఫ్యాన్స్‌కి కూడా దడ పుట్టించాడు. అయితే చాలా మంది మహేష్ కత్తి చెప్పిన విషయాలను వెంటనే నమ్మలేకపోయారు. అయితే మహేష్ కత్తి మాత్రం వరుసగా సాక్ష్యాలు చూపిస్తూ ప్రూవ్ చేస్తూనే ఉన్నాడు. ఆ తర్వాత నుంచీ పవన్ ఫ్యాన్స్ కూడా వెనకడుగు వేయాల్సి వచ్చింది. ఇక పవన్ కళ్యాణ్ అయితే అజ్ఙాతవాసి ప్రమోషన్స్ కోసం మీడియా ఇంటర్యూలు ప్లాన్ చేసి మరీ కేన్సిల్ చేసుకోవాల్సి వచ్చింది. మీడియా ముందుకు వస్తే పూనం కౌర్ ఇష్యూ విషయంలో ఇబ్బందికర ప్రశ్నలు ఎదురవుతాయన్న భయంతోనే పవన్ వెనక్కి తగ్గాడన్న అభిప్రాయాలు బలంగా వినిపిస్తున్నాయి.

ఇక ఈ మొత్తం వ్యవహారం వెనకాల పూనం కౌర్ హస్తం కూడా ఉందా అన్న అనుమానాలు కూడా వినిపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా మహేష్ కత్తి వాదనలకు బలం చేకూర్చేలా పూనం కౌర్ సోషల్ మీడియా స్పందించడం……. ఆ తర్వాత పవన్ క్యాంప్ నుంచి ప్రెషర్ వచ్చి డిలీట్ చేసిందేమో అన్న అభిప్రాయం వచ్చేలా తన కామెంట్స్‌ని వెంటనే డిలీట్ చేయడం… ప‌దే ప‌దే క‌త్తిమ‌హేష్ ఈ విష‌యం పూన‌మ్‌కే మేలు జరుగుతుంద‌ని చెప్ప‌డం దానికి బ‌లం చేకూర్చుతోంది.

ఇక తాజాగా పూనం కౌర్ శరీరంపై పికె అన్న టాట్టూ ఉన్న ఫొటోలు నెట్‌లో దర్శనమిస్తున్నాయి. అయితే ఆ ఫొటోలు ఫేక్ అన్న విషయం చూస్తేనే అర్థమవుతోంది. అయితే అసలు ఫొటో మాత్రం అతి త్వరలో మహేష్ కత్తి రిలీజ్ చేయబోతున్నాడని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్-పూనం కౌర్‌లు ముద్దులు పెట్టుకున్న ఫొటోలను కత్తి బయటపెట్టబోతున్నాడని తెలుస్తోంది. అది కూడా ఈ నెల 15వ తేదీన పవన్ కళ్యాణ్-పూనం కౌర్‌లు అత్యంత సన్నిహితంగా ఉంటూ ముద్దులు పెట్టుకున్న ఫొటోలు బయటపెట్టనున్నాడు కత్తి. అలాగే మహేష్ కత్తి దగ్గర పవన్ కళ్యాణ్-పూనం కౌర్‌లు సన్నిహితంగా ఉన్న వీడియోలు కూడా ఉన్నాయని చెప్తున్నారు. ఈ సాక్ష్యాలన్నీ కూడా మహేష్ కత్తికి ఎలా వచ్చాయన్న విషయం కూడా ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. కొంతమంది పవన్ ఫ్యాన్స్ కూడా పూనం కౌర్‌ని అనుమానంగా చూస్తూ ఉండడం గమనార్హం. మొత్తానికి మహేష్ కత్తి విడుదల చేస్తానంటున్న ఫోటోలు, వీడియోలు బయటికి వస్తే మాత్రం పవన్ ఇమేజ్ పూర్తిగా డ్యామేజ్ కావడం ఖాయమన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అత్యంత సంకట స్థితిలో ఇరుక్కున్న పవన్……తనను తాను ఎలా సమర్థించుకుంటాడో…..ఏం స్పందిస్తాడో చూడాలి మరి. షరా మామూలుగా స్పందించకుండా ఉంటాను అంటే మాత్రం అది ఇంకాస్త అనుమానాలను పెంచుతుందనడంలో సందేహం లేదు.

ఇక పూనం కౌర్ బ్రాండ్ అంబాసిడర్ వ్యవహారంపై ఎపి మంత్రులు చెప్తున్న మాటలు కూడా పలు సందేహాలు రేకెత్తిస్తున్నాయి. పూనం కౌర్‌ని బ్రాండ్ అంబాసిడర్‌గా నియమిస్తున్నట్టుగా సాక్షాత్తూ చంద్రబాబు మాట్లాడిన మాటలు ఇంకా యూట్యూబ్‌లో దర్శనమిస్తుంటే…….ఆంధ్రప్రదేశ్ మంత్రి కొల్లు రవీంద్ర మాత్రం అసలు పూనం కౌర్‌ని బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించలేదు అన్నట్టుగా చెప్తున్నాడు. అయితే బ్రాండ్ అంబాసిడర్‌నని చెప్పుకుంటూ ఆంధ్రప్రదేశ్‌లో చాలా జిల్లాల్లో పూనం కౌర్ పర్యటించి ఉండడం….ఆ పర్యటనలన్నీ మీడియాలో కూడా ప్రముఖంగా ప్రస్తావనకు వచ్చి ఉండడం గమనార్హం.

ఏది ఏమైనా పవన్ కళ్యాణ్-పూనం కౌర్ వ్యవహారంలో పవన్ కళ్యాణ్‌తో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవహారాలన్నీ కూడా అనుమానాస్పదంగా ఉన్నాయన్నమాట మాత్రం నిజం. పవన్ కళ్యాణ్-చంద్రబాబుల మధ్య ప్యాకేజ్ వ్యవహారాలు నడుస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు సాక్ష్యాలతో నిరూపిస్తున్న నేపథ్యంలో ముందు ముందు ఇద్దరూ కూడా పరస్పర ప్రయోజనాల కోసం చేసిన అవినీతి, అక్రమ వ్యవహారాలు ఇంకా ఎన్ని బయటపడతాయో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -