టీఆర్ఎస్ ఎంపీ, కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తారాస్తాయికి చేరింది. ఒకరి మీద ఒకరు సవాల్లు,ప్రతిసవాల్లు విసురుకుంటున్నారు. విద్యుత్ అంశంపై టిఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోందని కాంగ్రెస్ పార్టీ నేత రేవంత్ రెడ్డి మంగళవారం నాడు ప్రకటించారు. దివాళా కంపెనీలతో ప్రభుత్వం ఒప్పందాలు చేసుకొందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. మరోవైపు ప్రభుత్వంతో చర్చించేందుకు సిద్దమని కూడ ఆయనప్రకటించారు.
రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై టిఆర్ఎస్ ఎంపీ బాల్కసుమన్ రేవంత్ విమర్శలపై ఘాటుగా కౌంటర్ ఇచ్చారు.విద్యుత్ అంశంపై చర్చకు తాము సిద్దంగా ఉన్నామని బాల్క సుమన్ ప్రకటించారు. విద్యుత్‌పై కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని చెప్పారు. విద్యుత్ విషయమై తాము చెప్పేది అబద్దమని నిరూపిస్తే తాను ముక్కు నేలకు రాస్తానని టిఆర్ఎస్ ఎంపీ బాల్క సుమన్ చెప్పారు
బాల్కసుమన్ విసిరిన సవాల్‌ను రేవంత్ రెడ్డి స్వీకరించారు. బస్తీమే సవాల్ అంటూ చర్చకు ఎక్కడికి రావాలో చెప్పాలన్నారు. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మేము రెడీ. ఎక్కడికి రావాలో చెప్పండి? ఈ అంశంపై చర్చిస్తామంటే ప్రగతి భవన్ కు అయినా సరే వస్తాం. విద్యుత్ కొనుగోళ్లు, ప్లాంట్ల నిర్మాణంలో అక్రమాలను మేము నిరూపిస్తాం. ఎవరు మాట్లాడుతున్నది తప్పో, ఎవరు ముక్కు నేలకు రాయాలో ప్రజలే నిర్ణయిస్తారు’ అని ధీటుగా రేవంత్ ప్రతి స్పందించారు. మరి వీరి చర్చకు పోలీసులు పర్మీషన్ ఇస్తారా లేదా అన్నది చూడాలి.
