Tuesday, May 14, 2024
- Advertisement -

సర్దార్ సినిమా సూపర్ హిట్ పక్కా! ఎందుకంటే?

- Advertisement -

సినీ ఇండస్ట్రీలో చాలా వరకు సెంటిమెంట్స్ నమ్ముతుంటారు. ఇదే సెంటిమెంట్ ఇప్పుడు సర్దార్ సినిమా విషయంలో జరుగుతుంది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అని మెగా ఫ్యాన్స్ ఫిక్సైపోయారు. అసలు ఆ సెంటిమెంట్ ఎంటి అంటే? గబ్బర్ సింగ్ ఆడియో వేడుకకు ముఖ్య అతిధిగా చిరంజీవి వచ్చారు. అంతకు ముందు జల్సా ఆడియో కూడా చిరు చేతుల మీదుగానే విడుదలైంది.

ఈ రెండు సినిమాలు పెద్ద విజయం సొంతం చేసుకున్నాయి. మళ్ళీ చాలా రోజుల తర్వాత సర్దార్ ఆడియోకి చిరు వచ్చారు. ఈ సెంటిమెంట్ ఇప్పుడు పవన్ ఫ్యాన్స్ ను తెగ ఊరించేస్తుంది. ఇక మరో సెంటిమెంట్ దేవీ శ్రీ ప్రసాద్. ఈయన పవన్ కళ్యాణ్ తో చేసిన మూడు సినిమాలు సూపర్ హిట్లే. జల్సా ఆడియో అప్పట్లో సృష్టించిన సంచలనాలు మాటల్లో చెప్పడం కష్టం. ఇక గబ్బర్ సింగ్ ఆడియో కూడా ఏడాది పాటు అల్లాడించింది. ఈ రెండు సినిమాలు సూపర్ హిట్లే.

దేవీ-పవన్ కాంబినేషన్ లో వచ్చిన హ్యాట్రిక్ మూవీ అత్తారింటికి దారేది. ఈ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిందేమీ లేదు. ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ కొట్టేసి.. 80 ఏళ్ల తెలుగు సినిమా చరిత్రలో ప్రత్యేక చిత్రంగా మిగిలిపోయింది. ఇంతటి ఘనచరిత్ర ఉన్న కాంబినేషన్ లో వస్తున్న నాలుగో సినిమా సర్దార్ గబ్బర్ సింగ్. ఇప్పటికే ఈ సినిమా ఆడియోకు మంచి కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇదే ఊపు రేపు రిలీజ్ తర్వాత కూడా ఉంటుందని ఆశిస్తున్నాడు పవన్. సెంటిమెంట్లు వర్కవుట్ అయితే సర్దార్ కూడా సంచలనాలు సృష్టించడం ఖాయమని నమ్ముతున్నారు పవర్ స్టార్ అభిమానులు. 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -