Monday, May 20, 2024
- Advertisement -

పవన్ కి గట్టి పోటి ఇవ్వానున్నారా?

- Advertisement -

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఎస్ జే సూర్య దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతీ తెలిసిందే. అయితే ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ ఇంకా ప్ర్రారంభంకాలేదు. ప్రస్తుతం స్కీన్ ప్లే పనులపై చర్చలు జరుగుతున్నాయట. ఈ చిత్రాన్ని కూడా శరత్ మరార్ నిర్మిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టి ఏకథాటిగా షూటింగ్ పూర్తి చేసి దసరాకు విడుదల చేయడానికి ప్లాన్ చేశారు.

దసరాకు అంటే టైం చాలా తక్కువగా ఉండటం వల్ల ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయడానికి చూస్తున్నారు. అయితే దసరాకు విడుదల చేసినా.. సంక్రాంతికి రిలీజ్ చేసినా.. పవన్ కి మెగా హీరోలే పోటి ఇవ్వానున్నారు అనే గుసగుసలు వినిపిస్తున్నాయి. పవన్ తన సినిమాని దసరాకు రిలీజ్ చేస్తే ఆ టైంలో చెర్రీ సిద్ధంగా ఉన్నాడు.

సురేందర్ రె్డి దర్శకత్వంలో చెర్రి చేస్తున్న చిత్రాన్ని దసరాకు ప్లాన్ చేస్తున్నారు. ఒక వేళా సంక్రాంతికి రిలీజ్ కు ప్లాన్ చేస్తే ఇక్కడ కూడా పవన్ కి పోటి తప్పడం లేదు. ఈ సంక్రాంతికి చిరంజీవి తన 150వ సినిమాతో సిద్ధంగా ఉన్నాడు. అప్పుడు చిరు తో బాక్స్ ఆఫిస్ వద్ద పవన్ పోటి పడాల్సి వస్తుంది. అయితే తాజా సమాచారం ప్రకారం దసరా, సంక్రాంతి రెండూ కాకుండా సంక్రాంతికి కాస్త ముందుగానే రిలీజ్ చేయనున్నారు అని తెలుస్తుంది. అయితే ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ మొదలు అయ్యాక అసలు డేట్ బయటకు రానుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -