Tuesday, May 14, 2024
- Advertisement -

ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్!

- Advertisement -

యంగ్ టైగర్ ఎన్టీఆర్ అంటే దర్శకధీరుడు రాజమౌళికి ఎంతో ఇష్టం. ఈ విషయం రాజమౌళే చాలా సార్లు చెప్పాడు. అయితే ఈ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన మూడు సినిమాలు సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. అయితే యమదొంగ తర్వాత వీరిద్దరు కలిసి పనిచేయలేదు. మళ్ళీ వీరిద్దరి కాంబోలో సినిమా ఎప్పుడు వస్తుందా అని అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

కానీ ఎన్టీఆర్ కాని రాజమౌళి కాని ఈ విషయం పై ఎలాంటి స్పందన ఇవ్వడం లేదు. వీరిద్దరి కాంబినేషన్‌లో త్వరలోనే ఓ సినిమా తెరకెక్కనుందని సినీ పరిశ్రమలో ఓ ప్రచారం సాగుతోంది.సినీ పరిశ్రమలో మాత్రం ప్రిన్స్ మహేష్‌బాబు బావ టీవీపీ ఎంపీ గల్లా జయదేవ్ త్వరలోనే లాంచ్ చేయబోతున్న తమ హోమ్ ప్రొడక్షన్ బ్యానర్‌పై ఎన్టీఆర్, రాజమౌళి కాంబినేషన్‌లో ఓ మూవీ రూపొందించేందుకు ప్లాన్ చేస్తున్నారట. ఇప్పటికి ఈ సినిమాకి సంబంధించన చర్చలు కూడా చేసినట్లు తెలుస్తుంది.

ఎన్టీఆర్ 27వ ప్రాజెక్ట్, ‘బాహుబలి-2’ ముగిసిన అనంతరం వారి కాంబినేషన్ లో సినిమా ఉంటుందట. ఈ చిత్రాన్నికి రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథని అందించనున్నారట. ఎన్టీఆర్, జక్కన కాంబినేషన్ లో సినిమా వస్తుందంటే ఏ రెంజ్ లో హిట్ అవుతుందో ప్రత్యేకంగా చెప్పకర్లేదు. అయితే మరి ఈ చిత్రాన్ని ఏలగైన తెరకెక్కించాలి అని గల్లా జయదేవ్ ప్లాన్ చేస్తున్నాడట. మరి ఈ విషయంలో ఎంత వరకు నిజం ఉందో తెలియాలి అంటే కొంతకాలం ఆగాల్సిందే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -