బాహుబలి సినిమాతో ప్రభాస్ ప్యాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు. అయితే తాజాగా ప్రభాస్ కొత్త చిత్రం ‘ఆదిపురుష్’ సైట్స్ పైకి వెళ్ళకముందే సంచలనం సృష్టిస్తోంది. సినిమా టైటిల్ పోస్టర్ తోనే విపరీతమైన ఆసక్తి కలుగుతోంది. ఓమ్ రౌత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ద్వారా ప్రభాస్ బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్నారు.
ఈ సినిమాని అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కించనున్నారట. ఈ మూవీని ప్రధానంగా 3డీ ఫార్మాట్ లో తీస్తున్నారు. ఆదిపురుష్ ను 5 భారతీయ భాషల్లో రూపొందిస్తున్నారు. హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లోనే కాకుండా పలు విదేశీ భాషల్లోనూ ఆదిపురుష్ విడుదలవుతుంది. ప్రభాస్ ఈ చిత్రం ద్వారా బాహుబలి వంటి ధీరోదాత్తమైన పాత్రలో మరోసారి కనువిందు చేయనున్నారు. ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ విలన్ గా కనిపించనున్నాడట.
ఈ మూవీ షూటింగ్ ను 2021లో మొదలు పెట్టాలని ఈ చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోందట. టి సిరీస్, రెట్రో ఫిలింస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం 2022లో వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. రామాయణంలోని ఓ ఘట్టం ఆధారంగా ‘ఆదిపురుష్’ను తెరకెక్కిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. హైందవంలో రాముడ్ని ఆదిపురుషుడిగా భావించడం ఈ ప్రచారానికి బలం చేకూరుస్తోంది.
నిహారిక నిశ్చితార్థానికి బాబాయ్ పవన్ ఎందుకు రాలేదో తెలుసా ?
నిహారిక ఎంగేజ్మెంట్ లో స్పెషల్ గా ఎట్రాషన్ గా నిలిచిన బన్నీ..!