Thursday, March 28, 2024
- Advertisement -

ఆ డైరెక్టర్ కు ప్రభాస్ ఛాన్స్ ఇస్తాడా ?

- Advertisement -

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవల ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు మరణంతో కాస్త షూటింగ్స్ కు బ్రేక్ ఇచ్చిన ప్రభాస్ త్వరలోనే తన కొత్త సినిమాల షూటింగ్స్ తిరిగి ప్రారంభించనున్నాడు. ప్రభాస్ ప్రస్తుతం సాలార్, అదిపురుష్, ప్రాజెక్ట్ కే .. సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాల తరువాత అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తో కూడా ప్రభాస్ ఓ సినిమాకు కమిటైన సంగతి తెలీసిందే.

అయితే ప్రస్తుతం ప్రభాస్ లైనప్ లో మరో క్రేజీ డైరెక్టర్ పేరు కూడా గట్టిగానే వినిపిస్తోంది. కుటుంబ కథ చిత్రాలతో చక్కటి హాస్యాన్ని పండించే మారుతి డైరెక్షన్ లో కూడా ప్రభాస్ ఓ చిత్రానికి కమిటైనట్లు ఫిల్మ్ సర్కిల్స్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఈ కాంబినేషన్ కు సంబంధించి గతంలో కూడా వార్తలు షికారు చేశాయి. అయితే అటు ప్రభాస్ నుంచి గాని ఇటు మారుతి నుంచి గాని ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. దాంతో ఈ కాంబినేషన్ ఒట్టి రూమర్స్ యేనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ప్రస్తుతం సెట్స్ పై ఉన్న సాలార్ మరియు ఆది పురుష్ సినిమాలు ఈ నవంబర్ నాటికి పూర్తి కానున్నాయి. ప్రస్తుతం ప్రభాస్ ఒప్పుకున్న సినిమాలన్నీ హై వోల్టేజ్ యాక్షన్ చిత్రాలే కావడంతో కాస్త రిలీఫ్ కోసం మారుతి డైరెక్షన్ లో ప్రభాస్ నటించే అవకాశం ఉందని జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి.

ఇప్పటికే ప్రభాస్ కోసం మారుతి అదిరిపోయే లైన్ సిద్దం చేశారట. త్వరలోనే పూర్తి స్క్రిప్ట్ తో ప్రభాస్ కలిసే అవకాశం ఉందట. ఒకవేళ ఈ కాంబినేషన్ ఒకే అయితే సెట్స్ పైకి ఎప్పుడు వెళుతుందనేది ప్రశ్నార్థకమే. హీరోలకు ఏదో ఒక డిఫెక్ట్ పెట్టి అద్భుత విజయాలు అందుకునే మారుతి.. ప్రభాస్ కోసం కూడా ఒక డిఫెక్టివ్ క్యారెక్టర్ సిద్దం చేశారని టాలీవుడ్ ఇన్ సైడ్ టాక్. మరి ఈ క్రేజీ కాంబినేషన్ కేవలం రూమర్ గానే మిగిలిపోతుందా.. లేక ప్రభాస్ లైనప్ లో సెట్స్ పైకి వెళుతుందా ? అనేది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఎదురు చూడాల్సిందే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -