Saturday, April 20, 2024
- Advertisement -

మోడీ పాలన బాగానేఉంది.. కానీ !

- Advertisement -

ప్రస్తుతం అధికారంలో ఉన్న మోడీ సర్కార్ పై ప్రశంశలు ఏ స్థాయిలో ఉన్నాయో విమర్శలు కూడా అంతే స్థాయిలో వినిపిస్తూఉన్నాయి. ముఖ్యంగా మోడీ అధికారంలో ఉన్న ఈ ఎనిమిదేళ్ళ కాలంలో దేశం చాలా రంగాల్లో ముందుకు సాగింది. ముఖ్యంగా సాంకేతిక రంగంలో దేశాన్ని మోడీ సర్కార్ అగ్రపథంలో నిలిపింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. కరోనా కష్టకాలంలో కూడా దేశ ఆర్థిక వ్యవస్థను స్థిరంగా కొనసాగించడంలో మోడీ సర్కార్ విజయం సాధించింది. అయితే మోడీ తీసుకునే ఏకీకృత నిర్ణయాల వల్ల అటు ప్రజల నుంచి, ఇటు ప్రతిపక్ష పార్టీల నుంచి తరచూ ఎన్నో విమర్శలు ఎదురవుతూనే ఉన్నాయి. ఇదే విషయాన్ని తాజాగా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ప్రస్తావించారు.

తాజాగా ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగల పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న వెంకయ్య చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. మోడీ పరిపాలనలో దేశం అన్నీ రంగాల్లోనూ ముందుకు వెళ్తోందని దేశానికి ప్రపంచ స్థాయి గుర్తింపు లబిస్తోందని వెంకయ్య మోడీ పాలనను కొనియాడారు. చాలా తక్కువ సమయంలోనే దేశ ఖ్యాతి ప్రపంచ వ్యాప్తంగా వినిపించడం సాధారణ విషయం కాదని వెంకయ్య చెప్పుకొచ్చారు. దీనికి ప్రధాన కారణం మోడీ మార్గంలో యావత్ దేశ ప్రజలు పయనించడమే అని వెంకయ్య వ్యాఖ్యానించారు. అయితే మోడీ పాలనను ఓ వైపు మెచ్చుకుంటూనే మరోవైపు చురకలంటించారు వెంకయ్య.

మోడీ అనుసరిస్తున్న విధానాలపై కొన్ని వర్గాల నుంచి వ్యతిరేకత ఉందని, అందుకు కారణాలు ఏవైనప్పటికి మోడీ వాటిని అధిగమించాల్సిన అవసరం ఉందని వెంకయ్య చెప్పుకొచ్చారు. ఆ వ్యతిరేకతను అధిగమించాలంటే మోడీ ప్రతి పక్షాల పట్ల సానుకూల వైఖరి ప్రదర్శించాలని, తరచూ ప్రతిపక్షాలతో కలుస్తూ ఉండాలని వెంకయ్య సూచించారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు రాజకీయ ప్రత్యర్థులే తప్పా.. శత్రువులు కారని వెంకయ్య హితబోధ చేశారు. కాగా ప్రస్తుతం మోడీ సర్కార్ బీజేపీ వ్యతిరేక పార్టీ నేతలపై వరుసగా ఈడీ దాడులను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే మోడీ రాజకీయ కక్ష సాధింపు చర్యలతోనే ప్రతిపక్ష పార్టీ నేతలపై ఈడీ దాడులు నిర్వహిస్తున్నారని ఆరోపణ ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొనే వెంకయ్య నాయుడు మోడీకి హితబోధ హితబోధ చేశారని జాతీయ రాజకీయ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -