Sunday, May 19, 2024
- Advertisement -

జక్కన్నపై సీరియస్ అయిన ప్రభాస్?

- Advertisement -

బాహుబలి సినిమాతో ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ సంపదించుకున్నాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. బాహుబలి సినిమాని జక్కన్న రెండు సంవత్సరాలకు పైగా షూటింగ్ జరిపాడు. ఇప్పుడు రాబోతున్న బాహుబలి 2 కోసం కూడా అంతే సమయాన్ని కేటాయిస్తున్నాడట. ఈ విషయంపై ప్రభాస్ జక్కన్నపై కోపడుతున్నాడట.

ప్రస్తుతం ప్రభాస్ బాహుబలి షూటింగ్‍లో బిజీగా ఉన్నాడు. రాజమౌళిపై విసిగిపోయిన ప్రభాస్ మరోసారి రెండు సంవత్సరాలకు పైగా సమయాన్ని తీసుకోవద్దు వీలైనంత తొందరగా షూటింగ్ కాంప్లీట్ చేయమని చేపుతున్నాడట. ఈ సంవత్సరం చివరికల్లా ఎలాగైన ఈ సినిమా రిలీజ్ చేయాలి అని ప్రభాస్ ప్లాన్ చేస్తున్నాడట. నిజాన్నికి బాహుబలి సినిమా వల్ల ప్రభాస్ చాలా సినిమాలనే వదులుకున్నాడు.

సంవత్సరాన్నికి రెండు సినిమాలు చేయాల్సింది రెండు సంవత్సరాలకు ఒక్క సినిమా చేస్తున్నాడు. అలాగే బాలీవుడు కూడా ప్రభాస్ కోసం ఎదురు చూస్తుంది. బాహుబలి సినిమా షూటింగ్‍లో బీజీగా ఉండి ఏ సినిమాకి ఓప్పుకోలేకపోతున్నాడు. అందుకే జక్కన్నను బాహుబలి 2ని తొందరగా రిలీజ్ చేయమని చేపుతున్నాడట. మరి ప్రభాస్ కోరుకున్నట్లు బాహుబలి 2 ఈ సంవత్సరం వస్తుందో లేక వచ్చే సంవత్సరం వస్తుందో చూడాలి మరి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -