Sunday, May 5, 2024
- Advertisement -

ఫ్యాన్స్‌కు షాకిచ్చిన ప్రభాస్!

- Advertisement -

ఆదిపురుష్‌తో ఫ్యాన్స్‌ని నిరాశపర్చిన ప్రభాస్ తన తర్వాతి సినిమాలతో సత్తా చాటేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. ప్రభాస్ ఫ్యాన్స్ చాలా ఎగ్జైటింగ్‌గా ఎదరుచూస్తున్న ప్రాజెక్టుల్లో సలార్, ప్రాజెక్టు కే ఉన్నాయి. ఈ రెండు ప్రాజెక్టులో ప్రభాస్ ఫ్యాన్స్‌తో పాటు అంతా ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

ప్రాజెక్టు కే, సలార్‌తో పాటు రాజా డీలక్స్‌ సినిమాలు చేస్తున్నారు ప్రభాస్. ఇందులో సలార్ రెండు పార్టులగా రానుండగా వరుస సినిమా షెడ్యూల్‌తో ప్రభాస్ అలసిపోయాడట. దీంతో కొన్ని రోజులు ప్రభాస్ రెస్ట్ తీసుకోనున్నారనే వార్త నెట్టింట్లో హల్‌చల్‌గా మారింది. దీంతో ప్రభాస్ సినిమాల రిలీజ్ కాసింత లేట్ కానుంది.

సలార్‌ పార్ట్‌-1 ముందుగా నిర్ణయించిన 2023 సెప్టెంబర్ 28న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కావాల్సి ఉండగా.. ఈ చిత్రాన్ని నవంబర్‌కు వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది టీం. నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్‌ జోనర్‌లో నటిస్తున్న కల్కి 2898 ఏడీ హాలీవుడ్ సినిమాలకు ఏ మాత్రం తగ్గకుండా తెరకెక్కుతోంది. అలాగే మారుతి డైరెక్షన్‌లో చేస్తున్న సినిమా కూడా చిత్రీకరణ దశలో ఉండగా ఒక్కసారి ప్రభాస్ లైన్‌లోకి వస్తే ఫ్యాన్స్‌కు కనులవిందే?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -