Sunday, April 28, 2024
- Advertisement -

ప్రభాస్ – మారుతి మూవీ అప్‌డేట్!

- Advertisement -

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వరుస నినిమాలతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ప్రభాస్ నటించిన సలార్, ప్రాజెక్టు కే శరవేగంగా షూటింగ్ జరుగుతుండగా సలార్ త్వరలోనే విడుదల కానుంది. ఈ రెండు సినిమాల తర్వాత మారుతితో పాటు సందీప్ వంగతో సినిమాలను లైన్‌లో పెట్టారు ప్రభాస్.

ఇక మారుతి దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాకు రాజా డీలక్స్ అనే టైటిల్‌ని పరిశీలిస్తుండగా తాజాగా ఈ సినిమాకు సంబంధించిన క్రేజీ అప్‌డేట్ వచ్చేసింది. ఓ ఇంట్రెస్టింగ్‌ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ ఇప్పటివరకు 40 శాతం కంప్లీట్ అయిందట. ఇక రీసెంట్‌గా హీరోయిన్ మాళవిక మోహన్‌పై తీసిన ఓ సీన్ వైరల్‌గా మారగా ఎలాంటి లీకులు జరగకుండా జాగ్రత్త పడుతుందట చిత్ర యూనిట్. ఈ సినిమానని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ తెరకెక్కిస్తుండగా పాన్ ఇండియా వైడ్‌గా రిలీజ్ అవుతుందా లేదా అన్నది తెలియాల్సి ఉంది.

ఇక సందీప్​ వంగా దర్శకత్వంలో ప్రభాస్ నటించనున్న చిత్రానికి స్పిరిట్ అనే టైటిల్ ఖరారు చేసిన సంగతి తెలిసిందే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -