Sunday, May 19, 2024
- Advertisement -

ఏపీ క్రాస్ రోడ్స్‌లో బీజేపీ!

- Advertisement -

ఏపీలో ముందస్తు ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ముందస్తు ఎన్నికలు ఖాయమని ప్రచారం జరుగుతోండగా పొత్తుపై ఏటూ తేల్చుకోలేకపోతోంది బీజేపీ. వపన్ ఇప్పటికే బీజేపీతో దోస్తి కొనసాగిస్తున్నారు. అదే సమయంలో టీడీపీతో పొత్తు కన్ఫామ్‌ చేశారు. అంతేగాదు సీట్ల ఎంపికపై కసరత్తు కూడా ప్రారంభించారు పవన్. ఇదంతా చూస్తున్న బీజేపీ నేతలు తమ పరిస్థితి ఏంటో తెలియక తలలు పట్టుకుంటున్నారు.

టీడీపీతో కలిసి సాగుతామని ప్రకటించిన పవన్,బీజేపీ కూడా కలిసివస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. అయితే ఆ పార్టీ నేతల నుండి మాత్రం ఎలాంటి స్పందనలేదు. వేచిచూసే ధోరణినే అవలంభిస్తున్నారు బీజేపీ నేతలు. మరికొంతమంది నేతలైతే పొత్తు అంశాన్ని జాతీయ నాయకత్వమే చూసుకుంటుందని తమ పరిధిలో లేదని దాటవేసే ప్రయత్నం చేస్తున్నారు.

అయితే ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితులను గమనిస్తే బీజేపీకి పొత్తు తప్ప మరో మార్గం లేదు. సింగిల్‌గా పోటీ చేస్తే పార్టీ గెలిచే అవకాశాలు చాలా తక్కువ. ఈ నేపథ్యంలో పొత్తుపై బీజేపీ నేతలు ఆశలు పెట్టుకున్నారు. పైకి జాతీయ నాయకత్వంపై పొత్తు అంశాన్ని తొసి తప్పించుకుంటున్నా లోపల మాత్రం జనసేన -టీడీపీతో కలిస్తేనే బాగుంటుందని భావిస్తున్నారు. టీడీపీ – జనసేన సైతం బీజేపీకి కలుపుకుని పోవడం వల్ల రాష్ట్రం సంగతి పక్కన పెడితే జాతీయ స్ధాయిలో ఏపనైనా జరుగుగుందని భావిస్తున్నారట.

అందుకే టీడీపీ – జనసేన నేతలు ఎక్కడా బీజేపీతో పొత్తు అంశంపై నోరుజారడం లేదు.అటు బీజేపీ నేతలు సైలెంట్ మోడ్‌లోనే ఉండిపోయారు. ఓవరాల్‌గా ప్రస్తుతం పొలిటికల్ క్రాస్‌ రోడ్స్‌లో ఉన్న బీజేపీకి టీడీపీ – జనసేనతో కలిసి వెళ్లడం తప్ప మరో మార్గం లేదని విశ్లేషకులు భావిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -